Monday, March 16, 2026

సిసిఐ కొనుగోలు సెంటర్ వద్ద సిపిఐ నిరసన

నేటి సాక్షి, బెజ్జంకి:బెజ్జంకి మండలంలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) కొనుగోలు కేంద్రాల ముందు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి బోనగిరి రూపేష్ మాట్లాడుతూ, కిసాన్ కపాస్ యాప్ ను వెంటనే ఎత్తివేయాలి, ఎకరానికి 7 క్వింటాళ్ల పరిమితిని తొలగించాలి, తేమ శాతం 8 నుంచి 16 వరకు ఉన్న పత్తిని కొనుగోలు చేయాలి అని డిమాండ్ చేశారు. అకాల వర్షాలతో పత్తి పంట దెబ్బతిందని, రైతులకు ఎకరానికి ₹20,000 నష్టపరిహారం ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. సిసిఐ నిబంధనలు రైతులను ఇబ్బందులపాలు చేస్తున్నాయని విమర్శించారు.ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు సంఘం మధు,ఏఐఎవైఎఫ్ మండల అధ్యక్షులు దొంతరవేణి మహేష్ ,సిపిఐ గ్రామ కార్యదర్శి కల్లూరి బాలమల్లు, బండి సమ్మయ్య, సంఘ తిరుపతి ,రామంచ శేఖర్, కుంట లక్ష్మణ్, తిరుపతి పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News