నేటి సాక్షి వికారాబాద్ :మిర్జాగూడ వద్ద ఇటీవల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళిగా, రోడ్డుల పునర్నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ వికారాబాద్ జిల్లా కేంద్రంలో గురువారం విద్యార్థి సంఘాలు, కుల సంఘాలు, వైద్యులు, ఉపాధ్యాయ సంఘాలు , పెదింటి శ్రీకాంత్, ప్రవీణ్ రెడ్డి, డా,, శ్రీకాంత్ ఐ ఎం ఓ జనరల్ సెక్రటరీ, భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు.సినిమాక్స్ నుండి ఎన్టీఆర్ చౌరస్తా వరకు సాగిన ఈ ర్యాలీలో పాల్గొన్న ప్రజలు — “ప్రమాద రహిత రహదారులు కావాలి”, “ప్రాణాలకు విలువ ఇవ్వాలి” వంటి నినాదాలతో జిల్లా అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రజల ప్రాణాలు ప్రతిరోజూ రోడ్లమీద పోతున్నా, ప్రభుత్వాలు మాత్రం మౌనం వీడడం లేదని పాల్గొన్న వారు ఆవేదన వ్యక్తం చేశారు.రోడ్ల పునర్నిర్మాణ పనులు తక్షణమే ప్రారంభించకపోతే, మరింత పెద్ద స్థాయిలో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.రాష్ట్ర రవాణా మంత్రి రాజీనామా కు డిమాండ్ప్రభుత్వంలో జవాబుదారీతనాన్ని తీసుకురావాలి అంటే ప్రతిరోజు లక్షలమంది రోడ్డు ప్రయాణంలో సురక్షితంగా ఉండాలంటే రోడ్ల నిర్మాణము నిరంతర పర్యవేక్షణ ఆర్టిఓ అధికారుల నిర్లక్ష్యము ఆర్టీసీ డిపార్ట్మెంట్లో నిర్లక్ష్యము తగ్గాలంటే గత పది సంవత్సరాల లో చేవెళ్ల వికారాబాద్ ప్రాంతానికి ప్రజాప్రతినిధులు చేసిన ద్రోహానికి ప్రభుత్వంలో మున్ముందు జవాబుదారీతనాన్ని పెంచడానికి మిర్జాగూడ దుర్ఘటన కు న్యాయం చేయాలంటే రాష్ట్ర రవాణా మంత్రి రాజీనామా చేయాలని పలువురు డిమాండ్ చేశారు. స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలైనా కూడా కనీస వస్తలెటువంటి రోడ్ల విషయంలో ప్రభుత్వాన్ని సమ్మెల ద్వారా నిరసనల ద్వారా మేల్కొల్పవలసి వస్తుందంటే ప్రస్తుత పాలకులు ఎంత నిర్లక్ష్యంగా మరియు ప్రజా సంక్షేమము పట్ల చిత్తశుద్ధి లేని వారనీ అర్థమవుతుంది. సామాన్య ప్రజలు ప్రయాణించే బస్సులో సంఖ్య బస్సుల భద్రత నిరంతరము నేత్రుడుతున్న రోడ్ల యాక్సిడెంట్ల విషయంలో కఠినమైన నిబంధనలు విధించి ప్రతి పౌరుడు బాధ్యతగా మెలిగేటట్లు విలువైన ప్రాణాలని కాపాడే విధంగా వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నం చేయాలని డాక్టర్ కొప్పుల రాజశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు.వీరిలో దాదాపు 21 మంది ప్రాణాలు కోల్పోయారు. మరి నేను ఒక డాక్టర్‌గా చెప్తున్నాను, ఒక ప్రాణాన్ని కాపాడడానికి మనం ఎంత కష్టపడతాము. ఒక చిన్న జ్వరం వచ్చినా, పంటికి నొప్పి వచ్చినా, కంటికి నొప్పి వచ్చినా, మరి విలువైన ప్రాణాలు ఎలాంటి రోగం లేని వాళ్ళు, మరి రోడ్ల పైన ఏదో చిన్న పని కోసం బయటికి వెళ్తూ స్కూటర్ పైన, ఆటోలో, బస్సులో మరి విద్యార్థులు స్కూల్‌కి వెళ్తూ, కాలేజీకి వెళ్తూ మరి రోజే రోడ్ల పైన యాక్సిడెంట్లలో చనిపోతున్నారు.మరి దాదాపు ఒక్క సంవత్సరంలో తెలంగాణలోనే 6,000 మంది చనిపోతా ఉన్నారు. దాదాపు 20,000 యాక్సిడెంట్లు జరుగుతా ఉన్నాయి. బ్యాక్ పెయిన్ అని, వర్సెస్ నెక్ పెయిన్ అని, స్పైనల్ ప్రాబ్లమ్స్ అని మరి వాళ్ళ విలువైన సమయాన్ని, విలువైన డబ్బుని మరి హాస్పిటల్లో తగిలిస్తూ, అనారోగ్యంతో పడి ఉండి కుటుంబానికి భారమై ఈ యాక్సిడెంట్ లో ఎవరైతే దెబ్బతిని బతుకుతున్నారో, మరి ఇలాంటి వ్యవస్థకు కారణం ఎవరు?ఏ దేశంలో అయినా మరి ఏదో పెద్ద పెద్ద విషయాల కోసం, అంటే విద్య కోసము, ఫ్యాక్టరీల కోసము, ఎంప్లాయ్మెంట్ కోసం ఉద్యమం చేస్తారు. కానీ సిగ్గుచేటు ఏందంటే ఈ రోజు మనం రోడ్ల కోసం స్వాతంత్య్రం వచ్చి దాదాపు 79 సంవత్సరాలు అయినా కూడా ఈ రోజు రోడ్ల కోసం మరి ఈ రోజు విద్యార్థులు, కళాశాల విద్యార్థులు మరి ఉద్యమించాల్సి వస్తుంది అంటే, ఒక్కసారి మరి ఈ రోజు చదువుకున్న సమాజంలో ఎవరైతే ఓటు వేస్తున్నారో, టీచర్లు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, లాయర్లు కావచ్చు, మరి విద్యావంతులు కావచ్చు అందరూ ఆలోచించండి. మీరందరూ కూడా రోడ్ల మీదకి వస్తారు రోజు. మీ ప్రాణాలు రిస్క్‌లో ఉన్నాయి.పాండుర్ నుంచి అప్పాయింట్మెంట్ వచ్చే వారికి ఏడు మెడికల్ కాలేజీలు ఉన్నాయి. మీకందరికీ తెలుసా? మీకేమైనా యాక్సిడెంట్ అయితే, మీకు హోబీ రంధం పరిస్థితి ఉంటే, మీకు వెంటిలేటర్ ఫెసిలిటీ లేదు. పాండుర్లో లేదు, వికారాబాద్‌లో లేదు, చేర్యాల లేదు, మైనార్లలో లేదు. మరి మీ ప్రాణాలకు భద్రత ఏది? కాబట్టి సురక్షితమైన రోడ్లే మనకు కావాలి. మరి దీని కోసము సద్భుత సమాజంలో ప్రతి ఒక్కరూ కదలాలి, ఆలోచించాలి. మీ భవిష్యత్తు కోసం. మీరు కార్లో ఉన్నా, బెంజి కార్లో ఉన్నా, మీ ప్రాణానికి సేఫ్ అని లేదు, అందరూ గుర్తుపెట్టుకోవాలి.మరి చిన్న తప్పు చేసిన ఒకరిని ఒకరికి కత్తిలో పొడిచినా మరి ప్రాణం తీసిన వాడిని జైల్లో వేస్తాము, శిక్ష చేస్తాము. మరి దాదాపు 21 మంది ప్రాణాలకి కారణమైనటువంటి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో, ఇంతవరకు ఆయన రాజీనామా చేయలేదు. సో నేను ఏం కోరుతున్నానంటే, అకౌంటబిలిటీ రావాలి. ఈ రోజు పోయిన ప్రాణాల్ని నేను తేలేను, మీరు తేలేరు, ప్రభుత్వం తేలేదు. కానీ ముందు ముందు ఎవరైతే రోజు రోడ్ల మీదకి వస్తున్నారో, మరి ఈ ప్రజలకి భద్రత ఉండాలి.మరి వీళ్ళు సేఫ్‌గా ఉండాలంటే ప్రభుత్వంలో అకౌంటబిలిటీ ఉండాలి, డ్రైవర్లలో అకౌంటబిలిటీ ఉండాలి, ఆఫీసర్లలో అకౌంటబిలిటీ ఉండాలి. ప్రభుత్వంలో అకౌంటబిలిటీ ఉండాలంటే మనం ఎవరినో ఒకరిని బాధ్యుల్ని చేయాలి. కచ్చితంగా ఈ రాష్ట్ర రవాణా మంత్రి రాజీనామా చేయాలి. అప్పుడే కనీసము ప్రభుత్వంలో ఒక భయమనేది ఏర్పడుతుంది.ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేయాలి. ఇప్పుడున్న రవాణా మంత్రిని సాక్ చేయాలి (పని నుండి తొలగించాలి). ఆయన్ని డిస్మిస్ చేయాలి. అప్పుడే ఈ సంఘటనకి కనీసం కొంచమైనా న్యాయం జరుగుతుంది. అండ్ ముందు ముందు ఎవరైతే రోజు వేలలో, కోట్ల లక్షల్లో రోడ్ల మీదకి వస్తున్నారో వాళ్ళందరి ప్రాణాలకి మనకి కొంచెమైనా భరోసా కలుగుతుందని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాము.ఈ ఉద్యమాన్ని విద్యార్థులు మరి కళాశాల సకల జనులు మరి సమ్యలాగా ముందు తీసుకెళ్లి వికారాబాద్ జిల్లాలోని ప్రతి రోడ్డు కూడా మరి మర్మత్తులై రిపేర్ అయ్యేంత వరకు కూడా ఈ ఉద్యమం కొనసాగుతుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. మరి రాజకీయ నాయకులు పార్టీలకు అతీతంగా మీరు మీరందరూ కూడా ముందుకు రావాలి, రాజకీయాలు పక్కన పెట్టి, మరి అవసరమైతే ఇక్కడ ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో, ఎంపీలు ఉన్నారో, మంత్రులు ఉన్నారో మీరు రాజీనామా చేయాలి.ప్రభుత్వం గనుక ఫండ్స్ అలకేట్ చేయకపోతే, మీరు ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలి. ఒత్తిడి తీసుకురావడానికి అవసరమైతే మీరు రాజీనామా చేయాలి. ప్రజల పక్షాన ఉండి మీరు పోరాడాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నానని డాక్టర్ కొప్పుల రాజశేఖర్ రెడ్డి తెలిపారు.సకలజనుల ఆధ్వర్యంలో రేపటి నుంచి రోడ్ల నిర్మాణం పట్ల తీసుకోవలసిన కార్యక్రమాలను ప్రణాళిక చేసి ప్రకటిస్తామని నిర్వాహకులు చెప్పారు. మన్నెగూడ అప్పా జంక్షన్ రోడ్డు నిర్మాణము పూర్తి అయ్యేంతవరకు జిల్లాలోని అన్ని రోడ్లు బాగుపడే అంతవరకు ప్రజా ఉద్యమము నిరంతరంగా కొనసాగుతుందని దీనిని అడ్డుకుంటే తగిన ప్రతిఘటన ఎదురవుతుందని హెచ్చరించారు.





