‘నేటి సాక్షి’ ఎఫెక్ట్ —————-*నేటి సాక్షి – కోరుట్ల*( రాధారపు నర్సయ్య )కోరుట్ల మున్సిపల్ కమీషనర్ సార్ కు చెందిన కారును నడిపేందుకు ఒక ‘డ్రైవర్’ కావలెనంట.! అని మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఈ సమాచారం చక్కర్లు కొడుతోంది.! ఎందుకంటే ‘నిన్న-మొన్నటి’ దాకా ఆయన కారుకు డ్రైవర్ గా పనిచేసిన అతను ఎందుచేతనో తప్పుకున్నట్టు ముచ్చటించుకుంటున్నారు.! ఇదే క్రమంలో ‘కమీషనర్’ వాడుతున్న కారులోంచి ‘కమీషనర్’ బోర్డును కూడా తొలగించడం ‘చర్చానీయాంశమైంది’.! *’నేటి సాక్షి’ ఎఫెక్ట్.!*ఇది ఖచ్చితంగా ‘నేటి సాక్షి’ ఎఫెక్ట్ అని ముచ్చటించుకుంటున్నారు.!కోరుట్ల పట్టణానికి చెందిన ‘కట్కం.చంద్రశేఖర్’ ( జూనియర్ కేసిఆర్ ) కోరుట్ల మున్సిపల్ కమిషనర్ వాడుతున్న కారు వివరాలు కావాలని కోరుతూ..’సమాచార హక్కు’ చట్టం కింద దరఖాస్తు చేసుకున్నారు.ఆ కారు ఎవరిది.? దాని యజమాని వివరాలు.? కారు రిజిస్ట్రేషన్ నెంబర్..ఆ కారు నడుపుతున్న డ్రైవర్ ‘శానిటేషన్’ సెక్షన్ లో పనిచేసే అతనికే ఈ ‘డ్రైవింగ్’ బాధ్యతలు అప్పగించారా.? అంటూ ఆయన ‘సమాచార హక్కు’ చట్టం కింద దరఖాస్తు చేసుకున్నారు.కాగా..ఈ విషయాన్ని ‘నేటి సాక్షి’ దినపత్రిక ‘కమీషనర్ సార్..మీ కారు వివరాలు కావాలి’.! అన్న శీర్షికన గురువారం వెలుగులోకి తెచ్చింది.! దీంతో కమీషనర్ వెంటనే స్పందించి..తన కారులోంచి ‘కమీషనర్’ బోర్డును తొలగించడంతోపాటు..’నిన్న-మొన్నటి’ డ్రైవర్ నూ తొలగించినట్లు సమాచారం.! అదే విధంగా తన కారును నడిపేందుకు అర్జంట్ గా ఒక ‘డ్రైవర్’ను వెతికి పెట్టమని మున్సిపల్ సిబ్బందికి చెప్పినట్టు తెలిసింది.! అయితే.. కమీషనర్ పక్కనబెట్టిన ‘డ్రైవర్’ ఎవరన్నట్టు.? అతను సానిటరీ సెక్షన్ కు చెందిన వారేనా.? మరి అతనికి రెండు జీతాలు ఇస్తారా.? ఇచ్చారా.? లేక ‘సానిటరీ’ సిబ్బందిలోని వ్యక్తిని డ్రైవర్ గా వాడుకుంటే ..మరి ఆ ‘జీతం’ ఏమైనట్టు.? ఇంతకీ ఇప్పుడు వాడుతున్న కారు ఎవరిది.? ఏ కమీషనర్ కైనా ప్రభుత్వం ఇచ్చే కారు ఇదేనా.? ఇంకా వేరేదేదైనా ఉందా.? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ‘సమాచార హక్కు’ చట్టం కింద చేసుకున్న దరఖాస్తుకు ‘రిప్లై’లో చెబుతారు కావొచ్చని చర్చ జరుగుతోంది.!_____





