Monday, March 16, 2026

*ఘనంగా..’వందేమాతరం’ 150వ వార్షికోత్సవం** జగిత్యాల జిల్లా కలెక్టరేట్‌లో సామూహిక గీతాలాపన * ఉత్సాహంగా పాల్గొన్న అదనపు కలెక్టర్ లత—-*

నేటి సాక్షి – జగిత్యాల*( రాధారపు నర్సయ్య )స్వాతంత్ర్య ఉద్యమానికి ప్రేరణగా నిలిచిన ‘వందేమాతరం’ గేయం 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జగిత్యాల జిల్లా కలెక్టరేట్ ఆవరణలో శుక్రవారం సామూహిక గీతాలాపన కార్యక్రమం ఘనంగా జరిగింది.*అధికారులతో కలిసి ‘వందేమాతరం’ ఆలాపన*ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ బి.ఎస్. లత, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి.రాజగౌడ్ పాల్గొన్నారు. అధికారులు, సిబ్బంది, ఉద్యోగులు సమిష్టిగా వందేమాతరం గీతాన్ని ఆలపించారు.*దేశభక్తిని నింపిన గీతం: అదనపు కలెక్టర్ లత*ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి.ఎస్. లత మాట్లాడుతూ, “వందేమాతరం గీతం స్వాతంత్ర్య ఉద్యమంలో కోట్లాది భారతీయుల హృదయాల్లో దేశభక్తి జ్యోతి వెలిగించింది. ఆ గేయానికి 150 ఏళ్లు నిండిన సందర్భంగా భారత ప్రభుత్వం వందేమాతరం స్మారక నాణెం విడుదల చేయడం గర్వకారణం,” అని అన్నారు.*ప్రభుత్వ ఆదేశాల మేరకు గీతాలాపన*రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, స్థానిక సంస్థలు, ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలల్లో సామూహికంగా వందేమాతరం గీతాలాపన జరుగుతోందని అదనపు కలెక్టర్ తెలిపారు.*కలెక్టరేట్‌లో ఉత్సాహ వాతావరణం*కలెక్టరేట్ ఆవరణ దేశభక్తి నినాదాలతో మార్మోగింది. అధికారులు, సిబ్బంది దేశ జెండాకు వందనం చేస్తూ వందేమాతరం గీతం ఆలపించారు.కాగా..ఈ కార్యక్రమంలో పాలనాధికారి హకీమ్, జిల్లా అధికారులు, వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు._____

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News