Monday, March 16, 2026

*చంద్రగిరిలో పర్యటించిన ఎమ్మెల్యే పులివర్తి నాని.** *అసంపూర్తిగా నిలిచిన ఎమ్మార్వో కార్యాలయ భవనాన్ని పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించిన ఎమ్మెల్యే*

నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)ప్రజా సమస్యల పరిష్కార వేదికలో చంద్రగిరి మండలంలో భాగంగా వచ్చిన ఎమ్మెల్యే పులివర్తి నాని ఫిర్యాదులపై చంద్రగిరి ఎమ్మార్వో కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం సమస్యలపై అధికారులు తక్షణం స్పందించి ప్రజలకు ఎప్పటికప్పుడు పరిష్కారం చూపాలని అధికారులను ఆయన ఆదేశించారు అదేవిధంగా కోర్టులో ఉన్న భూ సమస్యలపై క్షుణ్ణంగా పరిశీలించి ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా త్వరితగతిన సమస్యలను పరిష్కరించాలన్నారు మండలంలోనీ అన్నీగ్రామాల నుండి వచ్చిన అర్జీలు ఇంటి పట్టాలు, డ్రైనేజీ, సిసి రోడ్లు సమస్యలపై అధికారులు పరిష్కరించేందుకు అంకిత భావంతో పనిచేయాలన్నారు ఆర్టీసీ అధికారులపై ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదులు రావడంతో పుంగనూరు, తిరుపతి డిపో మేనేజర్లతోఎమ్మెల్యే భేటీ అయ్యారు పల్లెవెలుగు బస్సులు పుంగనూరు, తిరుపతి జాతీయ రహదారిలో వెళుతూన్నాయని వాటిని సర్వీస్ రోడ్లలో ప్రయాణించేలా చర్యలు తీసుకోవాలని సర్వీసు రోడ్ లో వెళ్లి గ్రామాలవద్ద కచ్చితంగానిలపి ప్రయాణికులను ఎక్కించుకోవాలని ఆర్టీసీ అధికారులకు ఎమ్మెల్యే ఆదేశాలు జారీ చేశారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News