Monday, March 16, 2026

మరికల్ మండలంలో కల్తీకల్లు నివారించాలంటూ…..మరికల్ తాసిల్దార్ కు సిపిఐ వినతి మరికల్ మండలంలో అధిక ధరలకు విక్రయిస్తున్న కల్తీకల్లు….

నేటి సాక్షి,నారాయణపేట, నవంబర్ 7, నారాయణపేట జిల్లాలోని మరికల్ మండలంలోని వివిధ గ్రామాలలో కల్తీకల్లు జోరుగా కొనసాగుతున్న సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోవడం లేదంటూ సిపిఐ ఆధ్వర్యంలో శుక్రవారం నాడు మరికల్ మండల తాసిల్దార్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఏ నారంపేట జిల్లా కార్యవర్గ సభ్యులు పి వెంకటేష్ మాట్లాడుతూ మరికల్ మండలంలో ప్రతి గ్రామంలో కల్తీకల్లు జోరుగా కొనసాగుతుందన్నారు. కల్తీ కళ్ళు తాగడం వల్ల ప్రజల అనారోగ్య పాలకు గురవుతున్నారని ఆయన వివరించారు. మరికల్ మండలంలోని మాధవరం వెళ్లే రహదారిలో ఫ్యాక్టరీని ఏర్పాటు చేశారన్నారు. సంబంధిత శాఖ అధికారులకు విన్నవించిన పట్టించుకోవడంలేదని ఆయన వివరించారు. మాధవరం వెళ్లే రహదారిలో ఏర్పాటు చేస్తున్న కల్తీకల్లు తయారీని వెంటనే నిలిపి వేయాలన్నారు. మరికెల్లో తయారు చేసే కల్తీకల్లు పై విచ్చలవిడిగా అధిక రేట్లు విక్రయిస్తున్నారన్నారు. అధికారుల స్పందించకపోతే సిపిఐ ఆధ్వర్యంలో మరికల్ మండల కేంద్రంలోని ఇంద్ర గాంధీ చౌరస్తాలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు. అనంతరం మరికల్ మండల తాసిల్దార్ కు సిపిఐ ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేశారు. సిపిఐ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News