Monday, March 16, 2026

*యువతే దేశ భవిష్యత్తు-చట్టాన్ని గౌరవించే పౌరులుగా ఎదగాలి** జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ * ర్యాగింగ్, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచన——–*

నేటి సాక్షి – జగిత్యాల*( రాధారపు నర్సయ్య )జగిత్యాల జిల్లా కొండగట్టు జేఎన్‌టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన ‘ఫ్రెషర్స్-డే’ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. ఈ వేడుకకు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ప్రోత్సహించారు.*విద్య అనేది వ్యక్తిత్వ నిర్మాణానికి పునాది*ఈ సందర్భంగా ఎస్పీ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ..’విద్య అనేది కేవలం ఉద్యోగం కోసం కాదు, మంచి వ్యక్తిత్వాన్ని నిర్మించడానికి ఉపయోగపడే ఆధ్యాత్మిక శక్తి. ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో, కష్టపడి చదువుకుంటూ లక్ష్యాన్ని సాధించాలి’ అని అన్నారు.సాంకేతిక పరిజ్ఞానంతో పాటు మానవీయ విలువలు కూడా అలవరచుకోవాలని సూచించారు.*సోషల్ మీడియాలో సమయాన్ని సద్వినియోగం చేసుకోండి*సోషల్ మీడియా వేదికల్లో సమయాన్ని వృథా చేయకుండా, దానిని నేర్చుకోవడానికి, కొత్త ఆలోచనలు అభివృద్ధి చేసుకోవడానికి వినియోగించుకోవాలని విద్యార్థులకు సూచించారు.సమాజంలో పెరుగుతున్న సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలని, తెలియని లింకులు లేదా ఫేక్ ఐడీలకు స్పందించకూడదని హెచ్చరించారు.*ర్యాగింగ్‌కు దూరంగా ఉండాలి*’కళాశాలల్లో స్నేహపూర్వక వాతావరణం నెలకొనాలి. సీనియర్లు–జూనియర్ల మధ్య తేడా లేకుండా పరస్పర గౌరవంతో ప్రవర్తించాలి.ర్యాగింగ్ వంటి చర్యలు నేరం మాత్రమే కాకుండా, మనిషితనం కోల్పోవడమే’ అని ఎస్పీ అన్నారు.కళాశాల యాజమాన్యం విద్యార్థుల నడవడికపై ఎప్పటికప్పుడు శ్రద్ధ వహించాలని సూచించారు.*మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి*’గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలు జీవితాన్ని నాశనం చేస్తాయి. అలాంటి వాటికి దూరంగా ఉండండి.ఎవరైనా ఈ వ్యసనాల్లో పాల్గొంటున్నారని తెలుసుకుంటే, వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి’ అని విద్యార్థులకు సూచించారు.చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని, కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలని ఎస్పీ పిలుపునిచ్చారు.__________

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News