Saturday, March 21, 2026

*వరల్డ్ డయాబెటిస్ డే సందర్భంగా ప్రత్యేక ₹799/- డయాబెటిస్ హెల్త్ ప్యాకేజ్ ప్రారంభం**బయోథెసియోమీటర్ & బైడైరెక్షనల్ డాప్లర్ విత్ ఫుట్ స్కాన్ మెషిన్ ఆవిష్కరణ*

నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)తిరుపతి: వరల్డ్ డయాబెటిస్ డే సందర్భంగా అమరా హాస్పిటల్, తిరుపతిలో ప్రత్యేక ₹799/- డయాబెటిస్ హెల్త్ చెకప్ ప్యాకేజ్ ను ప్రారంభించింది. డయాబెటిస్‌ను ప్రారంభ దశలోనే గుర్తించి, సమయానుకూలమైన చికిత్స అందించడం ద్వారా దీర్ఘకాలిక సమస్యలను నివారించడం ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశ్యం.ఈ సందర్భంగా బయోథెసియోమీటర్ మరియు బైడైరెక్షనల్ డాప్లర్ విత్ ఫుట్ స్కాన్ మెషిన్ లను ఆవిష్కరించారు. ఈ ఆధునిక పరికరాలు డయాబెటిక్ న్యూరోపథీ మరియు పెరిఫెరల్ వాస్క్యులర్ వ్యాధులను ప్రారంభ దశలో గుర్తించడానికి సహాయపడతాయి, తద్వారా రోగులు మరింత సమగ్ర వైద్య సేవలను పొందగలరు.కార్యక్రమానికి ప్రధాన అతిథిగా డా. పి. రవి రాజు (అప్నా ప్రెసిడెంట్, ప్రెసిడెంట్ ఇంటర్నేషనల్ వాకర్స్ అసోసియేషన్) హాజరయ్యారు. అలాగే డా. రవి (మెడికల్ సూపరింటెండెంట్, అన్నగౌరి హాస్పిటల్), డా. మీనాక్షి (ఆర్ ఎం ఓ అన్నగౌరి హాస్పిటల్), డా. వరుణ్ (ఎండి జనరల్ మెడిసిన్), డా. లోకేశ్ (ఎండి జనరల్ మెడిసిన్), డా. వాసుదేవ రెడ్డి (హ్యాండ్ & మైక్రో సర్జన్), డా. రమ్య సాయి (లైఫ్ స్టైల్ మెడిసిన్) , భాగ్యలక్ష్మి (చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, అమరా హాస్పిటల్) తో పాటు ఇతర వైద్య బృందం, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.ఈ సందర్భంగావైద్యుల మాట్లాడుతూ డా. రవి రాజు “అమరా హాస్పిటల్ ప్రారంభించిన ఆధునిక పరికరాలు మరియు డయాబెటిక్ ప్యాకేజీలు ప్రజల ఆరోగ్యానికి గొప్ప తోడ్పాటు అవుతాయి. మధుమేహ నియంత్రణలో అవగాహన, ముందుగానే పరీక్షలు చేయించుకోవడం, జీవనశైలి మార్పులు అత్యంత కీలకమని నమ్ముతాను. ప్రతి ఒక్కరు ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని కోరుకుంటున్నాను” అని తెలిపారు. డా. మీనాక్షి మాట్లాడుతూ, “అమరా హాస్పిటల్ తీసుకున్న ఈ ముందడుగు ప్రశంసనీయం. ముందస్తు గుర్తింపు, సమగ్ర పరీక్షలు, కౌన్సెలింగ్ ద్వారా గుండె మరియు నరాల సమస్యలను తగ్గించవచ్చు. ప్రజలు తమ ఆరోగ్యంపై మరింత శ్రద్ధ పెట్టాలి” అని అన్నారు. డా. రవి మాట్లాడుతూ, “ఆధునిక పరికరాల వినియోగం రోగుల జీవితాలను మారుస్తుంది. ముఖ్యంగా డయాబెటిక్ ఫుట్ వంటి సమస్యల నివారణకు ముందస్తు పరీక్షలు కీలకం. నిరంతర ఫాలోఅప్‌తో మెరుగైన ఫలితాలు సాధ్యమవుతాయి” అని వివరించారు. డా. వరుణ్ మాట్లాడుతూ, “మధుమేహం నియంత్రణలో మందులతో పాటు ఆహారం, వ్యాయామం, జీవనశైలి కూడా ముఖ్యమైనవి. చిన్న మార్పులు పెద్ద ప్రయోజనాలను తెస్తాయి. ఈ ప్యాకేజీ రోగులకు సరళమైన మార్గదర్శకత్వాన్ని ఇస్తుంది” అని చెప్పారు. డా. లోకేశ్ మాట్లాడుతూ, “రక్త చక్కెర స్థాయిలను నిరంతరంగా పర్యవేక్షించడం, పాద ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం అత్యవసరం. దీర్ఘకాలిక సంక్లిష్టతలను నివారించడంలో ఈ టెస్టులు ముఖ్యపాత్ర పోషిస్తాయి” అని తెలిపారు.డా. వాసుదేవ రెడ్డి మాట్లాడుతూ, ప్రతి డయాబెటిక్ రోగికి పాదాల సంరక్షణ అత్యవసరమని పేర్కొన్నారు. ఆయన సూచన ప్రకారం, రోగులు ప్రతిరోజూ తమ పాదాలను పరిశీలించడం, గాయమైతే వెంటనే వైద్యుడిని సంప్రదించడం, కఠినమైన పాదరక్షలు ఉపయోగించకపోవడం, మరియు రక్త చక్కెర స్థాయిలను క్రమంగా పర్యవేక్షించడం అవసరం.అమరా హాస్పిటల్ అందిస్తున్న ఆధునిక ఫుట్ కేర్ సదుపాయాలు అనేకమంది రోగుల పాదాలను, ప్రాణాలను రక్షించడంలో కీలకపాత్ర పోషిస్తున్నాయని ఆయన అన్నారు. ఒక చిన్న గాయాన్ని నిర్లక్ష్యం చేయడం వలన పెద్ద ఆపరేషన్లు అవసరమయ్యే పరిస్థితులు వస్తాయని, కానీ సమయానికి గుర్తించి చికిత్స చేస్తే 95% కేసుల్లో పాదం రక్షించవచ్చని కూడా వివరించారు. డా. రమ్య సాయి మాట్లాడుతూ, “సరైన ఆహారం, వ్యక్తిగత వ్యాయామం, నిద్ర నియమం మరియు ఒత్తిడి నియంత్రణతో ఆరోగ్య పునరుద్ధరణ పూర్తిగా సాధ్యమే. డయాబెటిస్ రివర్సల్ అంటే కేవలం షుగర్ తగ్గించడం కాదు; అది మన శరీరాన్ని తిరిగి సరిసమాన స్థితికి తీసుకెళ్లే సమగ్ర ప్రక్రియ. ఈ ప్రోగ్రామ్ ద్వారా రోగులకు సరైన ఆహారం, క్రమమైన వ్యాయామం, నిద్ర నియమం, ఒత్తిడి నియంత్రణ మరియు మానసిక స్థితి మెరుగుదలపై పూర్తి మార్గదర్శకత్వం అందిస్తాము. ఈ విధానం రోగుల జీవనశైలిలో సానుకూల మార్పులు తీసుకురావడంలో చాలా ఉపయోగకరమని” ఆమె వివరించారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News