Saturday, March 21, 2026

విలేకరుల పిల్లలకు ఫీజు రాయితీ ఇవ్వాలని డిఈఓను కోరిన అన్వేషణ ప్రతినిధి ఈ.పద్మారావు కాపు

*(నేటిసాక్షి ప్రతినిధి మహేశ్వరం నవంబర్ 07:)*మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా:అన్వేషణ రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ఈ.పద్మారావు కాపు మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా విద్యా అధికారి ఐ.విజయకుమారి ని మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఆయన పత్రికా విలేకరుల పిల్లలకు స్కూల్ ఫీజులో రాయితీ కల్పించాలని విజ్ఞప్తి చేశారు.విలేకరులు సమాజానికి అద్దం పట్టే వృత్తిలో నిరంతరం కష్టపడి పని చేస్తారని,చాలామంది ఆర్థిక ఇబ్బందులతో పిల్లల విద్య ఖర్చులు భరించడంలో ఇబ్బందులు పడుతున్నారని వివరించారు.ప్రభుత్వం,విద్యాశాఖ తరఫున జర్నలిస్టుల కుటుంబాలకు ప్రోత్సాహక చర్యలు చేపట్టాలని కోరారు.డిఈఓ ఐ. విజయకుమారి ఈ ప్రతిపాదనపై సానుకూలంగా స్పందిస్తూ,పైస్థాయి అధికారుల దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్తామన్నారు.ఈ సందర్భంగా పద్మారావు మాట్లాడుతూ:-విద్య అనేది ప్రతి కుటుంబానికి ప్రాధమిక హక్కు.జర్నలిస్టులు ప్రజల సమస్యలను వెలుగులోకి తెచ్చే బాధ్యతను నిర్వర్తిస్తారు.అలాంటి విలేకరుల పిల్లల విద్యకు చిన్న సహాయం అయినా పెద్ద ప్రోత్సాహమే అన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News