Saturday, March 21, 2026

ఉత్తమ పౌరులుగా ఎదిగేందుకు స్కౌట్స్ అండ్ గైడ్స్ లో చేరండిజిల్లా విద్యాశాఖాధికారి కె.వి.ఎన్. కుమార్..

నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)తిరుపతి: భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ 75వ వ్యవస్థాపక దినోత్సవాన్ని తిరుచానూరులోని జెడ్పీ ఉన్నత పాఠశాల లో ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి తిరుపతి జిల్లా విద్యాశాఖ అధికారి కెవిఎన్ కుమార్ ముఖ్య అతిధిగా విచ్చేసి, మాట్లాడుతూ ఉత్తమ పౌరులుగా ఎదిగవందుకు స్కౌట్స్ అండ్ గైడ్స్ లో చేరాలని పిలుపునిచ్చారు. ఈ స్కౌట్స్, గైడ్స్ అభివృద్ధికి ఎటువంటి సహాయం కావాలన్న తాను ముందుండి జరిపిస్తానని తెలియజేశారు. క్రమశిక్షణ కలిగిన వ్యవస్థగా ప్రపంచమంతా వ్యాప్తి చెంది ఉన్నందువలన అనేకమంది బాలబాలికలు ఈ యొక్క ఉద్యమంలో చేరి అనేక నైతిక విలువలు నేర్చుకుంటూ సామాజిక సేవలో ఎలా పాల్గొనాలో ఎటువంటి సహాయ కార్యక్రమాలు చేయాలనే, సేవా భావాలతో యూనిఫారం ధరించి చేస్తూ ఉంటారని, వీరి యొక్క స్వచ్ఛంద సేవ ప్రశంసనీయమైనదన్నారు. ఆడిసినల్ ప్రాజెక్టు ఆఫీసర్ జి గౌరీ శంకర్, ఉప విద్యాశాఖ అధికారిని ఇందిరా దేవి ఆమె ఉపన్యసిస్తూ, స్కౌట్ వ్యవస్థలో పిల్లలు పాఠశాల స్థాయి నుంచి అన్ని విధాల ఉత్తమ పౌరులుగా భావి భారత పౌరులుగా ఇందులో ఉన్న నియమాలు ఆచరిస్తూ స్కౌట్ చట్టాన్ని గౌరవిస్తూ వారు ఆనందంతో ఈ యొక్క కార్యక్రమాలను చేస్తూ ఉంటారని, ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్కౌట్స్ కమిషనర్ వంశీ రాజా, ఉపాధక్షులు కుప్పిరెద్ది, జిల్లా ట్రైనింగ్ కమిషనర్ జి వెంకటేశ్వర్లు, ఏఎస్ఓసి కోటేశ్వరరావు, జిల్లా కార్యాలయ కమిషనర్ టి రమేష్ బాబు, డిఓసి లు సతీ సావిత్రి , ఏ వెంకటేశ్వర్లు కోశాధికారిని వాసుకి గైడ్ క్యాప్టెన్ పాల్గొన్నారు. భారీ సంఖ్యలో స్కౌట్స్ అండ్ గైడ్స్ పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News