Saturday, March 21, 2026

*మృతుల కుటుంబాలకు పీఎస్ఆర్ ట్రస్ట్ చేయూత* *తిరుమలాయపాలెం మండలంలోని 28 గ్రామాల్లో 60 కుటుంబాలకు ఆర్థికసాయం పంపిణీ**ప్రతి కుటుంబానికి రూ. 10 వేలు చొప్పున అందజేత*

నేటి సాక్షి పాలేరు ,నవంబర్ 07: నిరుపేద, సామాన్య కుటుంబాలను ఆదుకోవడంలో ఎప్పుడూ ముందుండే పీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్.. తిరుమలాయపాలెం మండలంలో మరోసారి తమ మానవత్వాన్ని చాటుకుంది. అక్టోబర్ 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు వివిధ కారణాల వల్ల మరణించిన వ్యక్తుల కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు ట్రస్ట్ తరపున శుక్రవారం సహాయక కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పర్యవేక్షణలో నడుస్తున్న పీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఈ నెలలో మండలంలో మరణించిన ఒక్కో కుటుంబానికి రూ. 10,000 చొప్పున ఆర్థిక సహాయాన్ని అందజేసింది. 28 గ్రామాల్లో 60 కుటుంబాలకు సాయం పంపిణీ చేశారు .. ఈ సహాయం పంపిణీ చేసిన గ్రామాల జాబితాలో వెదుళ్లచెర్వు, పిండిప్రోలు, తెట్టెలపాడు, దమ్మాయిగూడెం, జింకలగూడెం, గోల్ తండా, పాతర్లపాడు, తిప్పారెడ్డిగూడెం, జల్లేపల్లి, హైదర్ సాయిపేట, పడమటి తండా, చింతల తండా (చంద్రు తండా), మేడిదపల్లి, ఇస్లావత్ తండా, సుబ్లేడు, హస్నాబాద్, రఘునాధపాలెం, మంగలిబండ తండా, కాకరవాయి, ఏనుకుంట తండా, సోలీపురం, పైనంపల్లి, బచ్చోడు తండా, బచ్చోడు, బీరోలు, ఎర్రగడ్డ, కొక్కిరేణి, తిరుమలాయపాలెం గ్రామాలు ఉన్నాయి. మొత్తం 28గ్రామాల్లోని 60 కుటుంబాలకు ఈ ఆర్ధిక సాయం అందింది. ఈ కార్యక్రమంలో మండలంలోని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, మంత్రి పొంగులేటి అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మృతుల కుటుంబాలను ఆత్మీయంగా పలకరించి, వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కష్టకాలంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తమ ట్రస్ట్ ద్వారా అందిస్తున్న ఈ సహాయం పట్ల గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News