నేటి సాక్షి నారాయణపేట నవంబర్ 7, నారాయణపేట జిల్లా: జీవీకే ఈఎంఆర్ఐ 108 సేవల్లో విధి నిర్వాహణలో ప్రమాదానికి గురై మరణించిన అభంగాపురం గ్రామానికి చెందిన శ్రీనివాస్ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్‌గా విధులు నిర్వర్తిస్తూ శ్రీనివాస్ గారు 2024 మే 5న రోడ్డు ప్రమాదానికి గురై, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2024 మే 8న దురదృష్టవశాత్తు మరణించారు.మృతుడి కుటుంబానికి ఇప్పటికే జీవీకే కంపెనీ తరఫున ₹11 లక్షల పరిహారం అందజేయబడింది.108 అంబులెన్స్ సర్వీస్ ల స్టేట్ హెడ్ శ్రీ బి. సుధాకర్ గారు, హెచ్‌ఆర్ హెడ్ శ్రీ కిరణ్ కిషోర్ గారి ఆదేశాల మేరకు, హెచ్‌ఆర్ విభాగం తరఫున శ్రీ రవీందర్ గారు హైదరాబాద్ ఈఎస్ఐ కార్యాలయాన్ని సంప్రదించి, మృతుడి భార్య, తల్లి మరియు ఇద్దరు పిల్లలకు ప్రతినెల పెన్షన్ అందే విధంగా చర్యలు చేపట్టారు.ఈ రోజు చిక్కడపల్లి బ్రాంచ్ ఈఎస్ఐ కార్యాలయంలో బ్రాంచ్ మేనేజర్ శ్రీ బాల సూరి ఆధ్వర్యంలో, మృతుడి భార్య శ్రీమతి కురుమమ్మ, తల్లి బసమ్మ మరియు పిల్లల సమక్షంలో పెన్షన్ సర్టిఫికేట్‌ను అందజేయడం జరిగింది.* ఇట్టి కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ప్రోగ్రాం మేనేజర్ రవికుమార్ గారు ప్రత్యేక చొరవ తీసుకొని, కుటుంబ సభ్యులకు పెన్షన్ ఇప్పించడంలో వారి పాత్ర ఎంతగానో ఉందని కుటుంబ సభ్యులు తెలియజేశారు,నవంబర్ నెల నుండి కుటుంబ సభ్యులైన నలుగురికి ఈఎస్ఐ తరఫున ప్రతినెలపెన్షన్అందజేయబడుతుంది. కుటుంబ సభ్యులకు పింఛన్ కోసం కృషి చేసిన స్టేట్ హెడ్ బి. సుధాకర్ గారికి, హెచ్‌ఆర్ హెడ్ కిరణ్ కిషోర్ గారికి, హెచ్‌ఆర్ రవీందర్ గారికి, ఉమ్మడి జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ రవి గారికి, ఎగ్జిక్యూటివ్ రాఘవేందర్ గారికి కుటుంబ సభ్యులు మరియు 108 ఉద్యోగులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.





