నేటి సాక్షి – జగిత్యాల*( రాధారపు నర్సయ్య )జగిత్యాల జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా స్థాయి యువజన ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) రాజ గౌడ్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి రఘువరన్ ముఖ్య అతిథులుగా హాజరై యువతలో ఉత్సాహాన్ని నింపారు.*ప్రతిభ చూపిన కళాకారులు*ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుండి వచ్చిన సుమారు 350 మంది యువతీ–యువకులు వివిధ సాంస్కృతిక, సాహిత్య, శాస్త్రీయ పోటీల్లో తమ ప్రతిభను ప్రదర్శించారు.విజేతల వివరాలు ఇలా ఉన్నాయి—జానపద నృత్యం: మొదటి స్థానం హారిక అండ్ గ్రూప్ (తాటిపల్లి గురుకుల పాఠశాల), ద్వితీయ స్థానం సాత్విక అండ్ గ్రూప్ (గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, జగిత్యాల).స్టోరీ రైటింగ్: మొదటి స్థానం గాయత్రి (ఎస్.కె.ఎన్.ఆర్. డిగ్రీ కళాశాల), ద్వితీయ స్థానం జుఫిష నాజ్ (గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, జగిత్యాల).ప్రకటన పోటీలు: మొదటి స్థానం జుఫిష నాజ్, ద్వితీయ స్థానం హుదా ఫాతిమా.కవిత్వం: మొదటి స్థానం గాయత్రి, ద్వితీయ స్థానం మేఘన తాటిపెళ్లి.సైన్స్ మేళా: మొదటి స్థానం ఆర్యన్ కుమార్ సింగ్, ద్వితీయ స్థానం అవినాష్.విజేతలకు సర్టిఫికెట్లు బహుకరించగా, రాష్ట్ర స్థాయి యువజన ఉత్సవాల్లో పాల్గొనే అవకాశం కల్పిస్తామని జిల్లా యువజన మరియు క్రీడల శాఖ అధికారి కోరుకంటి రవికుమార్ ప్రకటించారు.ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి కే. రాము, మెప్మా ఏవో శ్రీనివాస్ గౌడ్, జిల్లా పేట అధ్యక్షులు పడాల విశ్వప్రసాద్, జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి చిట్టిపల్లి సుధాకర్, యువజన సంఘాల నాయకులు బొడ్డు రాజేష్, విజయ్, విక్రమ్ రెడ్డి, కోట మధుసూదన్, సీనియర్ కళాకారులు తదితరులు పాల్గొన్నారు.__________





