Monday, March 16, 2026

క్యాన్సర్ పై అవగాహనా ర్యాలీ..

నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి నవంబర్ 7 మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గల సిబ్బంది, మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు కలసి పట్టణంలో హైస్కూల్ నుండి సంతగేటు, బజారువీధి,మోటారు వీధి, బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగిది.అనంతరం బస్టాండ్ లో మానవహారం ఏర్పాటు చేశారు.క్యాన్సర్‌పై అవగాహన ర్యాలీలు దాని నివారణ, ప్రారంభ దశలో గుర్తించడం మరియు చికిత్సపై ప్రజలలో అవగాహన కల్పించడానికి నిర్వహిస్తారు. ఇవి సాధారణంగా నిర్దిష్ట క్యాన్సర్ రకాలపై దృష్టి సారించి, నెలవారీ లేదా వార్షిక అవగాహన కార్యక్రమాలలో భాగంగా జరుగుతాయి. క్యాన్సర్ అవగాహన ర్యాలీ చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ క్యాన్సర్ లక్షణాలను ప్రారంభ దశలో గుర్తించడం వల్ల చికిత్స విజయవంతం అయ్యే అవకాశాలు పెరుగుతాయని, క్యాన్సర్ నివారణకు సహాయపడే జీవనశైలి మార్పులు మరియు ఇతర జాగ్రత్తల గురించి అవగాహన కల్పించడం జరిగింది. క్యాన్సర్ రోగులకు మరియు వారి కుటుంబాలకు మద్దతు ఇవ్వడం, వారికి ఆశను కల్పించడం. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, వైద్యులు మరియు ప్రజలు కలిసి క్యాన్సర్‌పై పోరాడటానికి సహకరించడం జరుగుతుందని డాక్టర్ మోనా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్యకేంద్రం సిబ్బంది, ఏయన్ ఎంలు, ఆశ కార్యకర్తలు, ప్రధానోపాధ్యాయులు, ఉపాద్యయ, ఉపాద్యాయునులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News