నేటి సాక్షి – లక్షెట్టిపేట:(రేగుంట ప్రసాద్) నవంబర్ 07 :మండలంలోని వెంకట్రావుపేట సబ్ స్టేషన్ లో మరమ్మత్తుల దృశ్య శనివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు వెంకట్రావుపేట, దౌడపల్లి, రంగపేట, చెల్లంపేట, హనుమంతుపల్లి, చందారం, కొమ్ముగూడెం, ఎల్లారం, కొత్తూరు గ్రామాలలో అంతరాయం ఉంటుంది కావున వినియోగదారులు సహకరించాలని లక్షెట్టిపేట విద్యుత్ శాఖ ఏఈ గణేష్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.





