Monday, March 16, 2026

సబ్ కలెక్టర్ కార్యాలయంలో వందేమాతరజాతీయ గీతం సామూహికాలాపన..

నేటిసాక్షి, మిర్యాలగూడ : వందేమాతర జాతీయ గీతాన్ని రచించి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు శుక్రవారం వందేమాతర జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ మరియు వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో…కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు జాతీయ గీతం రచించి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, శుక్రవారం నియోజకవర్గ పరిధిలోని దామరచర్ల మండలంలోని రైతు వేదిక కార్యాలయంలో వ్యవసాయ శాఖ మండల అధికారి రూషేంద్ర మణి ఆధ్వర్యంలో వందేమాతర జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు తదితరులు పాల్గొన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News