రూప్ల తండా గ్రామపంచాయతీలో నీటి సమస్యలు: అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల ఆవేదననరసింహులపేట మండల పరిధిలోని రూప్లతండా గ్రామ పంచాయతీ పరిధిలోని మధు తండా ప్రాంతంలో గత కొన్ని రోజులుగా మిషన్ భగీరథ నీటి పైపులు లీక్ అవడంతో నీరు రోడ్లపై నిరంతరం పారుతోంది. దీనివల్ల చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ప్రతిరోజూ రాకపోకల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.గ్రామ ప్రజలు పలుమార్లు పంచాయతీ కార్యదర్శికి, స్థానిక అధికారులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిర్లక్ష్య ధోరణి కారణంగా విలువైన తాగునీరు వృథా అవుతుండడమే కాకుండా రహదారులు జారుడు మయంగా మారి ప్రమాదాలకు దారితీస్తున్నాయని తెలిపారు.ప్రజలు వెంటనే సంబంధిత అధికారులు స్పందించి పైపులు మరమ్మత్తు చేసి గ్రామంలో నీటి వృథాను అరికట్టాలని కోరుతున్నారు.





