Monday, March 16, 2026

*కోరుట్ల సెల్ పాయింట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా అడ్లగట్ట సురేష్ ఏకగ్రీవ ఎన్నిక**

నేటి సాక్షి – కోరుట్ల*( రాధారపు నర్సయ్య )కోరుట్ల పట్టణంలోని మొబైల్ వ్యాపారుల సంక్షేమం కోసం ఏర్పాటైన కోరుట్ల సెల్ పాయింట్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా అడ్లగట్ట సురేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.*నూతన కార్యవర్గం ఇదే.!*ఈ సందర్భంగా.. కోరుట్ల పట్టణంలోని 65 సెల్ పాయింట్ల వ్యాపారులు పాల్గొన్న సమావేశంలో నూతన కమిటీని ప్రకటించినట్టు కోణార్క్ సెల్ పాయింట్ యజమాని మార్త.శివకుమార్ మీడియాకు తెలిపారు.అసోసియేషన్ సభ్యుల ఏకగ్రీవ నిర్ణయంతో ఎం.డి. అబ్రార్ హుస్సేన్ ఉపాధ్యక్షుడిగా, గుండా రమేశ్ ప్రధాన కార్యదర్శిగా, గాజుల మధు కోశాధికారిగా, ఎ.ఎ. అఫ్జల్ సహాయక కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు.*సంఘ సభ్యుల పరిష్కారం కోసం..*నూతన అధ్యక్షుడు అడ్లగట్ట సురేష్ మాట్లాడుతూ..’సెల్ పాయింట్ల’ వ్యాపారులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు సంఘం బలంగా నిలబడుతుందన్నారు. సభ్యుల హక్కుల పరిరక్షణకు అండగా ఉంటామన్నారు. కోరుట్లలో మొబైల్ వ్యాపార రంగాన్ని మరింత అభివృద్ధి చేయడమే మా లక్ష్యమ’ని అన్నారు.____

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News