నేటిసాక్షి ప్రతినిధి:శనివారం రోజున తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (టి ఆర్ టి ఎఫ్) ఇల్లంతకుంట మండల శాఖ సమావేశం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇల్లంతకుంట యందు మధ్యాహ్నం 12 గంటలకు జరిగినది. ఇట్టి సమావేశానికి సభాధ్యక్షులుగా టిఆర్టిఎఫ్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు బుర్ర కృష్ణ ప్రసాద్ గౌడ్ గారు వ్యవహరించినారు. ఇట్టి సమావేశంలో ఇటీవల జరిగిన పరిణామాలపై పలువురు వక్తలు ప్రసంగించడం జరిగినది తదనంతరం ఇల్లంతకుంట మండల నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగినది. ఈ మండల శాఖ ఎన్నికల అధికారిగా టిఆర్టిఎఫ్ రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి బోయన్నగారి నారాయణ గారు వ్యవహరించగా ఎన్నికల పరిశీలకులుగా టిఆర్టిఎఫ్ రాష్ట్ర బాధ్యులు పోతుగంటి రమేష్ వ్యవహరించారు.నూతన కార్యవర్గం.టిఆర్ టిఎఫ్ మండల అధ్యక్షులుగా పచ్చిమట్ల అనిల్ కుమార్ (సోషల్ స్కూల్ అసిస్టెంట్ జెడ్ పి హెచ్ ఎస్ నిమ్మపల్లి ఇల్లంతకుంట)మండల ప్రధాన కార్యదర్శి గావెల్ది కుమారస్వామి (ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్ జెడ్ పి హెచ్ ఎస్ వెల్జిపూర్ ) లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినది. ఉపాధ్యక్షులుగా కటకం రాజ్ కుమార్, పూదరి స్వప్న, రాష్ట్ర కౌన్సిలర్లు గా రెంటాల రమణారెడ్డి, ఎర్రోళ్ల రాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తదనంతరం మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎన్నికైన పచ్చిమట్ల అనిల్ కుమార్, వెల్ది కుమారస్వామి మాట్లాడుతూ… తమను మండల అధ్యక్ష ప్రధాన ఎన్నికైనందుకు చాలా సంతోషంగా ఉందని, తమ ఎన్నికకు సహకరించిన జిల్లా శాఖకు కృతజ్ఞతలు తెలియజేశారు. వృత్తి నిబద్ధతతో వ్యవహరిస్తూ సంఘ ఆదేశాలకు కట్టుబడి ఉంటామన్నారు. ఈ సందర్భంగా టిఆర్టిఎఫ్ రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ అధ్యక్షులు బుర్ర కృష్ణ ప్రసాద్ గౌడ్ మాట్లాడుతూ… పిఆర్సి గడువు పూర్తయి రెండు సంవత్సరములు గడిచినను పిఆర్సి నివేదిక తెప్పించుకొని అమలు పరచకపోవడం సరైన పద్ధతి కాదని వెంటనే పిఆర్సి నివేదికను తెప్పించుకుని 60% ఫిట్మెంట్తో అమలు చేయాలని డిమాండ్ చేసినారు. ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు రావలసిన డిఏలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసినారు. టెట్ క్వాలిఫై అయిన ఉపాధ్యాయులే ప్రమోషన్‌కు మరియు ఉద్యోగంలో కొనసాగడానికి అర్హులని సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టులో తిరిగి టిఆర్టి తరపున కౌంటర్ రివ్యూ పిటిషన్ వేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఆర్టిఎఫ్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు బుర్ర కృష్ణ ప్రసాద్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి బోయన్నగారి నారాయణ, పోతుగంటి రమేష్, పచ్చిమట్ల అనిల్ కుమార్, వెల్ది కుమారస్వామి,కటకం రాజ్ కుమార్, రెంటాల రమణారెడ్డి, పూదరి స్వప్న, కోల వినయ్ కుమార్, గాజేంగి విష్ణు, మామిడాల రమేష్, సుల్తాన్ రాజు, గోలి రాధకిషన్, గుగులోత్ రమేష్ నాయక్, బూట్ల శ్రీనివాస్, పులి ప్రవీణ్ కుమార్, పేరుక వెంకటేశ్వరరావు, సామల రాములు, ఇప్పకాయల ప్రకాష్, లక్కే లక్ష్మీరాజం తదితరులు పాల్గొన్నారు.





