Saturday, March 21, 2026

మైనర్ డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు ట్రాఫిక్ ఎస్ఐ కృష్ణ చైతన్య..

నేటి సాక్షి,నారాయణపేట, నవంబర్ 8,నారాయణపేట జిల్లా కేంద్రంలో మైనర్ డ్రైవింగ్‌పై ప్రత్యేక తనిఖీలు నిర్వహించిన ట్రాఫిక్ ఎస్సై కృష్ణ చైతన్య తల్లిదండ్రులు మరియు మైనర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు.ఈ సందర్భంగా ట్రాఫిక్ SI గారు మాట్లాడుతూ… తల్లిదండ్రులు తమ పిల్లలకు వాహనాలు ఇవ్వరాదని, మైనర్ పిల్లల చేత వాహనాలు నడపడం చట్టవిరుద్ధమని తెలిపారు. వారు అవగాహనలేమితో డ్రైవింగ్ చేసి ఇతరులకు కూడా ఇబ్బందులు కలిగించి రోడ్డు ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు వాహనాలు ఇవ్వకుండా జాగ్రత్త వహించాలని మళ్లీ రిపీట్ అయితే వాహనాలను సీజ్ చేస్తూ తల్లిదండ్రులను చట్ట ప్రకారం జైలుకు పంపించడం జరుగుతుందని సూచించారు. అలాగే, విద్యార్థులకు ట్రాఫిక్ రూల్స్, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాలను నివారించడమే లక్ష్యంగా పోలీసులు ఇలాంటి తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News