నేటి సాక్షి, నారాయణపేట, నవంబర్ 8, నారాయణపేట జిల్లాలోని ధన్వాడ మండలంలోని ఆకుమర్రి తండా కొండాపూర్ కు చెందిన కాట్రావత్ గీత, జాతీయ స్థాయి రెస్లింగ్ ఛాంపియన్‌షిప్‌లలో ఎస్ జి ఎఫ్ స్కూల్ గేమ్స్‌లో) కాంస్య పతకం (బ్రోనజ్ మెడల్) సాధించడం అద్భుతం.ఆమె కృషికి మరియు ప్రతిభకు గుర్తింపుగా రైల్వే స్టేషన్లో సన్మానం చేయడం హర్షణీయం. ఇది ఆమెకు మరియు మిగతా యువ క్రీడాకారులకు గొప్ప స్ఫూర్తిని ఇస్తుంది.కేజీబీవీ ధన్వాడలో సెకండ్ ఇయర్ చదువుతున్న గీత భవిష్యత్తులో మరిన్ని గొప్ప విజయాలు సాధించాలని, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనమందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం.





