నేటి సాక్షి, బాపట్ల జిల్లా (ఇంకొల్లు)ఇంకొల్లు నూతనంగా నిర్మించిన ఆస్టర్ రమేష్ హాస్పిటల్ ను శనివారం ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ప్రారంభించారు. తొలుత ఎమ్మెల్యే ఏలూరికి ఆస్పత్రి యాజమాన్యం పూర్ణకుంభంతో వేద పండితుల ఆశీర్వచనాలతో స్వాగతం పలికారు. అనంతరం ఆస్పత్రిలో పలు విభాగాలను ఎండి రమేష్ బాబు తో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజల చెంతకే కార్పొరేట్ వైద్య సేవలు అందించడం అభినందనీయం అన్నారు. పేదలకు నాణ్యమైన కార్పొరేట్ వైద్యం అందించేందుకు ఇంకొల్లులో హాస్పటల్ బ్రాంచ్ ని ఏర్పాటు చేయడం శుభ పరిణామం అన్నారు. గత అనేక దశాబ్దాలుగా ఆస్టర్ రమేష్ హాస్పటల్ సామాన్య ప్రజలకు సైతం కార్పొరేట్ సేవలందిస్తూ మనలను పొందినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సేవలు విస్తృతం చేయాలని ఆకాంక్షించారు. సందర్భంగా ఎమ్మెల్యే ఏలూరి ఆస్టర్ రమేష్ హాస్పిటల్ సిఎస్ఆర్ ఫండ్ కింద ఈ ప్రాంతంలో ప్రభుత్వ వైద్యశాలలను ఆధునికరణ అభివృద్ధి చేసేందుకు తమ వంతు సహకారం అందించాలని కోరారు. ఈ సందర్భంగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ పోతిన రమేష్ బాబు మాట్లాడుతూ,“ఇంకొల్లు పరిసరాల్లో క్వాలిటీ మెడికల్ సర్వీసులు అవసరమని చాలా కాలంగా ప్రజలు కోరుకుంటున్నారు. ఆ అవసరాన్ని తీర్చేందుకు ఆధునిక పరికరాలు, అత్యవసర సేవలు, నిపుణుల వైద్య సేవలతో హాస్పిటల్‌ను విస్తరించాం. గ్రామీణ ప్రాంత ప్రజలకు సరసమైన ఖర్చుతో అత్యుత్తమ చికిత్స అందించడం మా లక్ష్యం” అని తెలిపారు. ఎమ్మెల్యే ఏలూరి సూచనలు మేరకు సిఎస్ఆర్ ఫండ్ కింద ప్రభుత్వ వైద్యశాలల అభివృద్ధికి సహకారం అందిస్తామన్నారు. కార్యక్రమంలో మాల కార్పొరేషన్ చైర్మన్ విజయ్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ గుంజి వెంకట్రావు , నాయకులు నాయుడు హనుమంతరావు, కర్రి శ్రీనివాసరావు, బోడెంపూడి సుబ్బారావు , సాంబయ్య,ఆస్టర్ రమేష్ హాస్పిటల్ యాజమాన్యం మమత, కార్తీక్, భరత్,వైద్య బృందం పాల్గొన్నారు.





