నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి నవంబర్ 8మండలంలోని వెంగళపల్లి గ్రామస్తులు శనివారం గ్రామ సమీపంలోని మణుకురు గుట్ట మామిడి వనములో కార్తీక వనభోజన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వెంగళపల్లి విద్యార్థులు, యువకులు ఆటల పాటలతో ఉత్సాహంగా సహపంక్తి భోజనాలు చేశారు. ఈ సందర్భంగా హార్ట్ ఫుల్ నెస్ రామచంద్ర మిషన్ ట్రైనర్స్ చిలకపాటి శివశంకర్, మురళీధర్ రెడ్డి, డాక్టర్ మానస, గ్రామస్తులకు ధ్యానం, రిలాక్సేషన్ నేర్పించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య అధికారి డాక్టర్ రాజశేఖర్ మాట్లాడుతూ మార్గం ఏదైనా గమ్యం ఒకటేనని, ధ్యానం చేయడంవల్ల మానసిక శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుందని అన్నారు. వెంగళపల్లి గ్రామస్తులు వనభోజనం చేయడం చాలా ఆనందకరమన్నారు ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహించాలన్నారు ఈ కార్యక్రమంలో పి శ్రీనివాసులు, పి చంద్రశేఖర్, రామకృష్ణ, యశోద, ఊటూరు చెంగల్రాయప్ప, వెంకటేష్ వాలంటీర్స్ శ్రీరాములు, నారాయణ రెడ్డి, వెంగళపల్లి పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు





