నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)చిత్తూరు, నవంబర్ 8: జర్నలిజం పేరుతో ఉద్యోగులను వేధించడం తగదని, అలా బ్లాక్ మెయిల్ చేసే విలేకరులపై తగిన చర్యలు తప్పవని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడటం, వారిని బ్లాక్ మెయిల్ చేయకుండా కార్యాలయంలోని సిబ్బంది నిర్భయంగా పని చేసుకునే వాతావరణం కల్పించడం తన బాధ్యత అని కలెక్టర్ తెలిపారు. ఇద్దరు స్థానిక పాత్రికేయులు కార్యాలయంలోని మహిళా ఉద్యోగులతో సహా ప్రభుత్వ ఉద్యోగులను పదేపదే బ్లాక్ మెయిల్ చేశారని, బెదిరించడానికి ప్రయత్నించారని తన దృష్టికి వచ్చిందని కలెక్టర్ తెలిపారు. ఈ సంఘటనపై పూర్తి స్థాయిలో విచారించి ఆ ఇద్దరు లో ఒకరు అక్రిడిటేషన్ కార్డు కలిగిన వారు వారి కార్డును రద్దు చేశామన్నారు. పౌరులు, ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడటానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ పై ప్రకటనలో తెలిపారు.





