నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)*ఎస్ఆర్ పురం* వెంకటాపురంలోని మాజీ సర్పంచ్ చంద్రగిరి వెంకటేష్ @ మోషే శుక్రవారం అనారోగ్యంతో మృతి చెందారు. ఈ సమాచారం తెలుసుకున్న మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి శనివారము వెంకటాపురం చేరుకుని మాజీ సర్పంచ్ భౌతిక కాయానికి పూలమాలవేసి నివాళులర్పించారు. సమితీ ప్రెసిడెంట్ గా ఉన్న సమయంలో ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. బాదిత కుటుంబ సభ్యులు చంద్రగిరి తంభయ్య సోదరులు, సర్పంచ్ సతీమణిని ఓదార్చారు.ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.





