Tuesday, March 17, 2026

*ధర్మారం వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం**.

నేటి సాక్షి, ధర్మారం (నవంబర్ 8)* : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని మేడారం ప్యాక్స్ ఆధ్వ్యర్యంలో నిర్వహిస్తున్న ధర్మారం వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రం ను తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశాల మేరకు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లావుడ్య రూప్లా నాయక్, మేడారం ప్యాక్స్ చైర్మన్ ముత్యాల బాలరాం రెడ్డి కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రం ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మాట్లాడుతూ… రైతులు తాము పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలో విక్రయించి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లావుడ్యా రూప్లా నాయక్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గాగిరెడ్డి తిరుపతి రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అరిగే లింగయ్య, మేడారం ప్యాక్స్ చైర్మన్ ముత్యాల బలరాం రెడ్డి, వైస్ చైర్మన్ సామంతుల రాజమల్లయ్య, ఏ ఎం సి డైరెక్టర్లు కాంపెల్లి రాజేశం, జనగామ తిరుపతి, ఈదుల శ్రీనివాస్, గంధం మహిపాల్, అలువాల రాజేశం, కొంగ భూమయ్య, వడ్లకొండ అంజయ్య, కోలా శ్రీనివాస్, ఎలగందుల అశోక్, ఆవుల శ్రీనివాస్, పాలక వర్గ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ యూత్ నియోజకవర్గ అధ్యక్షులు అశోద అజయ్, మండల కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు సోగాల తిరుపతి, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పాలకుర్తి రాజేశం గౌడ్, పార్టీ సీనియర్ నాయకులు కాడే సూర్యనారాయణ, దేవి జనార్దన్, ఒడ్నాల శంకరయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు సెంటర్ ఇంచార్జ్ లు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News