Tuesday, March 17, 2026

బెజ్జంకి మండలంలో పత్తి దగ్ధం – రైతుని ప్రభుత్వం ఆదుకోవాలి- తేమ శాతం పేరుతో కొనుగోలు ఆలస్యం భారీ నష్టం…

నేటి సాక్షి, బెజ్జంకి:బెజ్జంకి మండల కేంద్రంలో బండి ఐలయ్య కు చెందిన పత్తిని ఇంటి ఆవరణలో తేమ శాతం రావటం కోసం ఆరబెట్టగ ప్రమాదవ శాత్తు నిప్పు అంటుకొని సుమారు 350 క్వింటాళ్ల పత్తి దగ్ధం అయ్యింది.విషయం తెలుసుకొని భారత రాష్ట్ర సమితి మండల అధ్యక్షులు పాకాల మహిపాల్ రెడ్డి, సీనియర్ నాయకులు లింగాల లక్ష్మణ్ లు సంఘటన స్థలాన్ని పరిశీలించి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తేమ శాతం కొర్రీలు పెడుతూ రైతులను ఇబ్బంది పెడుతూ నష్టాన్ని చేకూరుస్తున్నారని,దాదాపు 350 క్వింటాళ్ల పత్తి అగ్నికి ఆహుతి అయ్యిందని, రైతుకు సుమారు 25 నుండి 30 లక్షల నష్టం జరిగిందని, బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని , కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News