నేటి సాక్షి – కోరుట్ల*( రాధారపు నర్సయ్య )కోరుట్ల పట్టణ శివారులోని మెట్ పల్లి రోడ్ లో గల హెచ్‌పీ పెట్రోల్ పంపు ముందు శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు బైకులు ఎదురెదురుగా వచ్చి బలంగా ఢీకొనడంతో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు.గాయపడిన వారిని స్థానికులు తక్షణమే కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో చింతలపేటకు చెందిన రాజేష్‌ను జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, మెట్ పల్లికి చెందిన జి.శంకర్‌ను మెట్ పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.ఈ రోడ్ ప్రమాదంలో రెండు బైకులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రమాదంపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.___





