Tuesday, March 17, 2026

హమాలి కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి కార్మికుల చట్టాలకు తీరని లోటు ఏ ఐ టి యు సి నారాయణపేట జిల్లా ఉపాధ్యక్షులు వెంకటేష్..

నేటి సాక్షి,నారాయణపేట నవంబర్ 9, హమాలి కార్మికులకు పని భద్రత కల్పించాలని ఏ ఐ టి యు సి నారాయణపేట జిల్లా ఉపాధ్యక్షులు పి వెంకటేష్, హమాలి సంఘం అధ్యక్షులు జీ శ్రీనివాసులు అన్నారు. ఆదివారం నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల కేంద్రంలో హమాలీ కార్మికుల జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హమాలీల లోడింగ్ అన్ లోడింగ్ కార్మికులకు అగ్ర చట్టాన్ని తీసుకురావాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇట్టి అమాలి కార్మికులు ఎన్నో సంవత్సరాలుగా పని చేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేకంగా అసంఘటిత కార్మికులకు అగ్ర చట్టాన్ని తీసుకురావాలని ఎన్నో పోరాటాలు కొనసాగిస్తున్న ప్రభుత్వాలు మాత్రం మారిన పట్టించుకోవడం లేదన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వచ్చి హమాలీ కార్మికులకు కార్మిక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ప్రతి జిల్లాలోని ప్రతి మండల కేంద్రాల్లోని సంక్షేమ ప్రత్యేక బోర్డ్లని ఏర్పాటు చేయాలనే డిమాండ్ చేశారు. అనంతరం హమాలి కార్మికులకు బీమా సౌకర్యం ఏర్పాటు చేయాలన్నారు. అదేవిధంగా ప్రత్యేక యూనిఫామ్ లు, వి ఎస్ ఐ కార్డులను అందజేయాలన్నారు. పని చేసే క్రమంలో అకస్మాత్తుగా ప్రమాదం జరిగిన కార్మికులకు ప్రభుత్వమే రూ, 10 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలన్నారు. కార్మికులకు అంగవైకల్యం ఏర్పడిన వారికి ఐదు లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వమే ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలన్నారు. అనంతరం అమాలి కార్మికులకు ఐడెంటి కార్డులను ఆయన అందజేశారు.ఇట్టి కార్యక్రమంలో హమాలి సంఘం అధ్యక్షులు జీ శ్రీనివాసులు, ఉపాధ్యక్షులు రాములు, హమాలి సంఘం కమిటీ సభ్యులు ఆంజనేయులు,వెంకటేష్, ఎల్లప్ప,తిమ్మప్ప నరసింహులు రఘు, బాలప్ప, బాలయ్య, రాజు రామకృష్ణ అంజయ్య, వెంకన్న,వెంకటప్ప,రాజు, రాము, రాజుతదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News