Tuesday, March 17, 2026

*వేడుకగా చెవిరెడ్డి పుట్టినరోజు వేడుకలు**అక్షయ క్షేత్రంలో అనాధ పిల్లలకు బ్రెడ్లు, స్వీట్లు, పండ్లు పంపిణీ*..

నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అత్యంత వేడుకగా సాగాయి. తిరుపతి రూరల్ మండలం దుర్గ సముద్రం సమీపంలో గల అక్షయ క్షేత్రంలో ఆదివారం చెవిరెడ్డి పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. వైయస్సార్ విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ బి ఓబుల్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ వేడుకలు చేపట్టారు. అనేక మంది అనాధ పిల్లల మధ్య భారీ కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. బ్రెడ్ లు, స్వీట్లు పండ్లు అనాధ పిల్లలలందరికీ అందజేశారు. ఈ సందర్భంగా వైయస్సార్ విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ బి ఓబుల్ రెడ్డి మాట్లాడుతూ.. దేవుడు అనుగ్రహం, ప్రజల అండతో చెవి రెడ్డి కుటుంబం రాజకీయంగా రాణించాలని చెప్పారు. చంద్రగిరి నియోజకవర్గ ప్రజలకు కష్టనష్టాల్లో చెవి రెడ్డి కుటుంబం అన్ని రకాలుగా అండగా నిలిచిందని తెలిపారు. చంద్రగిరి నియోజకవర్గ అభివృద్ధికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎంతో కృషి చేశారని అన్నారు. ఎన్ని కుట్రలూ కుతంత్రాలూ కేసులు పెట్టినా కడిగిన ముత్యంలా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జనం మధ్యకు వస్తారని ధీమా వ్యక్తం చేశారు. దేవుని అండా ప్రజాభిమానం ఉంటే చంద్రగిరి కోటపై మళ్లీ వైసీపీ జెండాను తప్పక ఎగరేస్తామని వైయస్సార్ విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ బి ఓబుల్ రెడ్డి స్పష్టం చేశారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఆయురారోగ్యాలు, రాజకీయ భవిష్యత్తు ఉన్నతంగా కలగాలని శ్రీవారిని వేడుకున్నారు.ఈ కార్యక్రమంలో వైయస్సార్ విద్యార్థి, యువజన సంఘాల నాయకులు ప్రదీప్, వెంకటేష్, మోహన్ రెడ్డి, భూపాల్, శేషాద్రి, మధుసూదన్, ధర్మేందర్ రెడ్డి, భరత్ రెడ్డి, నందకుమార్, తేజరెడ్డి, జేబీ, బల్ల సుబ్రహ్మణ్యం, శ్రీనివాసులు, రామకృష్ణ, చెవిరెడ్డి అభిమానులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News