నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం వేదికగా చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే, డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఆదివారం వైఎస్ఆర్ విద్యార్థి విభాగం ఎస్వీ యూనివర్సిటీ అధ్యక్షలు ప్రమ్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడినాయి.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి గారు ఎస్వీ యూనివర్సిటీ ప్రధాన ద్వారం వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి బాణసంచా పేల్చి కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి మాట్లాడుతూ —“డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ప్రారంభం నుంచీ వైఎస్ఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉంటూ ప్రజలకు అహర్నిశ సేవ చేస్తున్నారు. నిరుపేదల అభ్యున్నతికి ఆయన తన స్వంత నిధులతో అనేక ప్రజాహిత కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇలాంటి మరెన్నో జన్మదినోత్సవాలు ఆయన జరుపుకోవాలని మనస్పూర్తిగా ఆకాంక్షిస్తున్నాను” అని తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఓబుల్ రెడ్డి, చంద్రగిరి నియోజకవర్గం విద్యార్థి విభాగం అధ్యక్షులు చంగల్ రెడ్డి, చంద్రగిరి రూరల్ మండల అధ్యక్షుడు గూడూరు రఫీ, విద్యార్థి నాయకులు శివ, ముని, నరేష్, మహేష్, సతీష్ రెడ్డి, మనోజ్, సుధీర్, దిలీప్, రాజా తదితర నాయకులు పాల్గొన్నారు.





