నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి నవంబర్ 10మండలంలోని పెద్ద ఎల్లకుంట్ల పంచాయతీ ఊటూరులో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గువ్వల రమేష్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు గ్రామంలో దశాబ్దాల తరబడి ప్రజలు ఎదుర్కొంటున్న సిమెంటు రోడ్డు నిర్మాణానికి 7 లక్షలతో సిమెంట్ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తున్నట్లు ఆయన వివరించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పూల చంద్రమౌళి బోయకొండ సుబ్బు ముని వెంకటప్ప సింగల్ రాయప్ప మండలంలోని నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు





