Tuesday, March 17, 2026

*అందెశ్రీ మరణం తెలంగాణ జాతికి తీరని లోటు – మాజీ మంత్రి జీవన్ రెడ్డి*————————————*అందెశ్రీ కి పద్మశ్రీ అవార్డు ప్రకటించాలి**జగిత్యాల ఇందిరా భవన్లో అందెశ్రీ మృతికి ఘన నివాళులు.*జగిత్యాల టౌన్ –

నేటి సాక్షి(పూరెళ్ల బాపు)…………………………………..ప్రజాకవి, జానపద వాగ్గేయకారుడు అందెశ్రీ మృతి పై సంతాపం వ్యక్తం చేస్తూ, జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో కాంగ్రెసు పార్టీ ఆద్వర్యంలో మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి అందెశ్రీ చిత్ర పటానికి పూల మాలలు వేసి, ఘనంగా నివాళులు అర్పించారు. అందెశ్రీ మృతి పట్ల తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.రెండు నిమిషాలు మౌనం పాటించి, నివాళులు అర్పించారు.*మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి మాట్లాడుతూ*అందెశ్రీ రాసిన తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణ..జననీ జయ కేతనంతోపాటు ఆయన రాసిన పాటలు ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తి రగిలించాయి.తెలంగాణ ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు సాహితీ వేత్తగా, సమాజానికి మాయ మై పోతున్నాడు మనిషన్నవాడు అని పాటలో అంతరించి పోతున్న మానవ విలువలకు అద్దం పట్టేలా రాసి సమాజాన్ని నెలకొల్పారు.అందెశ్రీ రాసిన జయ జయహే గీతాన్ని సి ఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర గీతంగా ప్రకటించారు.అందెశ్రీ కి 2014 లో రాష్ట్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డ్ కోసం ప్రతిపాదించినప్పటికీ అందని ద్రాక్షగానే మిగిలిపోయింది.అందెశ్రీ సేవలకు గుర్తుగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి, పద్మశ్రీ అవార్డ్ ప్రకటింప చేసేలా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని జీవన్ రెడ్డి కోరారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News