నేటి సాక్షి:–నందికొట్కూరు తాలూకా జూపాడుబంగ్లా మండల కేంద్రం లోని ఎపి. మోడల్ బాలికల స్కూల్లో నందికొట్కూరు ఎమ్మెల్యే. గిత్త. జయసూర్య పాఠశాల నీ ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ తనిఖీల్లో భాగంగా పాఠశాలలోని వంట గది, ఇతర గదులు మరియు పరిసరాల పరిశుభ్రతను విద్యార్థులు మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించడం జరిగినది పాఠశాల పరిసరాలు, ముఖ్యంగా వంట గది అపరిశుభ్రంగా ఉన్నాయని గుర్తించారు. ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది.అనంతరం విద్యార్థులతో సమావేశమై కలిసి భోజనం చేయడం జరిగింది. పిల్లల సమస్యలను అడిగి తెసుకున్నారు. వారి సమస్యలను విని ఆమె నివ్వెరపోయారు ఎమ్మెల్యే గిత్త జయసూర్య గారు ప్రిన్సిపాల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు విద్యార్థులకు, సామర్థ్యానికి సరిపడా మధ్యాహ్న భోజనాలు లేకపోవడంపై అసహనం వ్యక్తము చేశారు.అనంతరం సంరక్షకురాలు గారిని వసతి గృహాలకు సంబంధించి నిర్వహణను పరిశీలించి మంచిగా పెట్టుకోవాలని సూచించడం జరిగింది. నిర్వహణ భాగంగా గతంలో జరిగిన ఒక సంఘటనపై మాట్లాడుతూ స్కూల్ సౌకర్యాలపై అందిన ఫిర్యాదుల మేరకే ఆకస్మికంగా తనిఖీ అని అన్నారు. వసతి గృహ సంరక్షణపై ఉన్నతాధికారికి ఫోన్ చేసి ఫిర్యాదు చేసి మరల ఇటువంటి సంఘటన జరగకుండా చూసుకోవాలని తెలియజేయడం జరిగింది, ఎమ్మెల్యే గిత్త జయసూర్య గారు హెచ్చరించడమైనది.పిల్లల ఆరోగ్యంతో చెలగాట మాడరాదన్నారు. వేగవంతంగా వారి సమస్యల పరిష్కార దిశగా సిబ్బంది అడుగులు వేయాలని లేకుంటే ఉపేక్షించే లేదని చెప్పారు. ఎమ్మెల్యే గిత్త జయసూర్య హెచ్చరించడమైనది. ఈ కార్యక్రమంలో జూపాడుబంగ్లా నాయకులు గ్రామ పెద్దలు, మండల కన్వీనర్, గుండ్రెడ్డిమోహన్ రెడ్డి, జంగాల పెద్దన్న, కడియం వెంకటేశ్వర్లు, యాదవ్,పరమేశ్వర రెడ్డి, రవి కాంత్, గిరీశ్వర్ రెడ్డి, పిక్కిలి, శ్రీనివాస్, మహేశ్వర్ రెడ్డి, నారాయణ రెడ్డి, దొరబాబు, ప్రసన్న రెడ్డి, పల్చని మహేశ్వర రెడ్డి నాయకులు కార్యకర్తలు ప్రభుత్వం అధికారులు పాల్గొన్నారు





