నేటి సాక్షి నారాయణపేట నవంబర్ 10, నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల కేంద్రంలో సర్వేనెంబర్ 449లో పట్టాగలిగి సాగు చేసుకుంటున్నా రైతులకు 3నెలల్లో పట్టాపాసుపుస్తకాలు ఇవ్వనున్నట్లు డిసిసి మాజీ జిల్లా అధ్యక్షులు శ్రీ కుంభం శివకుమార్ రెడ్డి తెలిపినట్లు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గోపాల్, కాంగ్రెస్ పార్టీ నాయకులు సూర్యమోహన్ రెడ్డి గారు తెలిపారు. మరికల్ పట్టణ కేంద్రంలో సూర్యచంద్ర ఫంక్షన్ హాల్ లో జరిగిన సదస్సులో వారు మాట్లాడుతూ 1968లో అనాటి ఇందిరాగాంధీ హయాంలో మరికల్ లోని 90 కుటుంబాలకు చెందిన పేదలకు పట్టాలు ఇచ్చిందన్నారు అభుమిని నమ్ముకుని బతుకుతున్న రైతుకుటుంబాలను గత ప్రభుత్వం దౌర్జన్యంగా భూములు లాక్కోవాలని చూసిందన్నారు .ఎర్రజెండా రైతులకు అండగా నిలబడి పోరాడి భూములు సాధించుకోవడం జరిగిందన్నారు.గత ఎన్నికల్లో రైతులు టిఆర్ఎస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పారన్నారు .ప్రభుత్వం మూడు నెలల్లో పట్టా పాసుపుస్తకాలు ఇవ్వడానికి ఒప్పుకున్నందున ప్రభుత్వానికి మరియు శివకుమార్ రెడ్డి గార్లకు ప్రత్యేక దన్యవాదాలు తెలిపారు, కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి బలరాం, భీమరాజ్ , వెంకట్రాములు,మల్లయ్య, గోవర్ధన్,సుదర్షన్, రాజామల్లేస్,టైసన్ రఘు,గోరేఖాజా మరియు భూ బాధితులు పాల్గొన్నారు.





