Tuesday, March 17, 2026

కుల ధ్రువీకరణ పత్రం అందించడంలో రెవిన్యూ జాప్యం ఎందుకో..?–ధరణి ఆపరేటర్ చరవాణితో మూవీతో కాలక్షేపం..–అప్లికేషన్ పేపర్లు సైతం గల్లంతు..–తైలం అందితేనే సర్టిఫికెట్ల తాళం ఓపెన్..–ఫైరవీలు చేసిన స్థానికేతరులకు ఇప్పటికే పలువురికి సర్టిఫికెట్ల మంజూరు..–ఇచ్చింది వాస్తవమే ఐతే ఏంటి అంటూ తహసీల్దార్ గరం గరం..*

నేటి సాక్షి, జగిత్యాల ప్రతినిధి:* ( గుండ ప్రశాంత్ గౌడ్ )దేవుడు వరం ఇచ్చిన పూజారి కనికరించడం లేదు అనే సామెతకు నిలువెత్తు నిదర్శనం ఉంది ఆ అధికారి పనితీరు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో సర్టిఫికెట్ల కోసం ప్రజలు అర్జీ పెట్టుకొని చెప్పులు అరిగేల తిరిగిన ప్రయోజనం మాత్రం శూన్యంగానే మారింది. సంబంధిత అధికారి ఆర్ ఐ ఇచ్చిన దరఖాస్తులు దర్యాప్తు చేసి సంతకాలు పెట్టిన తహసీల్దార్ నిర్లక్ష్యం వాళ్ళ నిరుపేదలకు సేవలు అందడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రతి పనికి తైలం అందితేనే సర్టిఫికెట్ల తాళం ఓపెన్ చేస్తామంటూ సిబ్బంది తమ చేతివటం చూపిస్తున్నారని ఆరోపించారు. సర్టిఫికెట్లకై భూమి సంబంధిత సమస్యలతో వచ్చిన ప్రజలకు ధరణి ఆపరేటర్ చరవాణితో మూవీతో కాలక్షేపంచేస్తూ దర్శనం ఇవ్వడం దీనికి నిదర్శనమని అనుకుంటున్నారు.అర్జీలు పెట్టి రోజులు గడిచిన ఎన్ని సార్లు అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేసిన ఫలితం లేకపోగా ఫైరవీలు చేసిన స్థానికేతరులకు ఇప్పటికే పలువురికి సర్టిఫికెట్ల మంజూరు చేశారని కనీసం ఎవ్వరు పట్టించుకున్న పాపాన పోవడం లేదని పేర్కొన్నారు.తహసీల్దార్ నిర్లక్ష్యం వాళ్ళ సిబ్బంది చేతివటంతో అనేక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. చివరికి తిరిగి తిరిగి అలసిన ప్రజలు కనీసం మా అప్లికేషన్ లు మాకు ఇవ్వండి అంటూ అడిగిన పేపర్లు సైతం గల్లంతు అయ్యాయని సమాధానం ఇచ్చారని వాపోయారు.ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోని నిరుపేదలకు సక్రమంగా అందావలసిన సర్టిఫికెట్లు ఇప్పించాలని పలువురు కోరుతున్నారు. ఇది ఇలా ఉంటే స్థానికేతరులకు ఫిరవిలతో సర్టిఫికెట్లు అందించడం పట్ల నేటి సాక్షి ప్రతినిధి వివరణ కోరగా సర్టిఫికెట్ ఇచ్చింది వాస్తవమేనని ఐతే ఏంటి మీరు ఎవ్వరు అడగడానికి అంటూ దురుసుగా మాట్లాడటం విశేషం.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News