Tuesday, March 17, 2026

నర్సింహులపేట ఎంపీడీవో కుర్చీ ఖాళీగా 15 రోజులు..!ప్రజల ఇబ్బందులు, అధికారుల నిర్లక్ష్యం..

నేటి సాక్షి మహబూబాబా ద్ నరసింహుల పేట( భూక్యా రవి నాయక్) నవంబర్ 11మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయం గత 15 రోజులుగా అధికారిని లేకుండా ఖాళీగా ఉంది. చార్జ్ తీసుకునే ఇన్‌చార్జి కూడా లేని పరిస్థితి నెలకొంది. ఫలితంగా ప్రజలు తమ పనుల కోసం కార్యాలయానికి వచ్చినా తిరిగి నిరాశతో వెళ్లిపోతున్నారు.మండలానికి సంబంధించిన పంచాయతీ, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అన్నీ నిలిచిపోయాయి. అధికారుల నిర్లక్ష్యం, పాలకుల పట్టింపు లేకపోవడంపై స్థానిక ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.“మండలంలో అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోయాయి. ఎవ్వరూ స్పందించడం లేదు. ఈ పరిస్థితిపై జిల్లా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలి” అంటూ ప్రజలు వాపోతున్నారు.ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని మండలంలో చర్చనీయాంశమైంది — “ఎంపీడీవో కార్యాలయంలో కుర్చీ ఖాళీగా, ప్రజలు అవస్థలు పడుతూ ఉన్నారు” అని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News