నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)మెడికల్ కాలేజ్ ప్రవేటీకరణకు వ్యతిరేకం గా ఈ నెల 12 న (నేడు )చంద్రగిరి అసెంబ్లీ నియోజవర్గం లో వైయస్ఆర్ సీపీ చేపట్టిన నిరసన ర్యాలీనీ విజయవంతం చేద్దామని చంద్రగిరి నియోజకవర్గంలోని విద్యార్థి లోకానికి ఆ పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షలు చెంగల్ రెడ్డి పిలుపునిచ్చారు ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించేలా జరిగే ఈ ర్యాలీలో విద్యార్థి లోకo అంతా పాల్గొంటుందని ఆయన చెప్పారు.దీన్ని ఒక ప్రజా ఉద్యమంగా ముందుకు తీసుకెళ్తామన్నారు.అందరి సహకారంతో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం విజయవంతం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.విద్యార్థులు ఆందోళనలు,ర్యాలీలతో జాతీయస్థాయిలో చర్చ జరిగి చంద్రబాబు ప్రభుత్వం దిగివస్తుందన్నారు. ఈ పోరాటం లో కలసి వచ్చే విద్యార్థి, యువత,కుల సంఘాలు,స్వచ్ఛంద సంస్థలు ఇలా అందరినీ కలుపుకొని ముందుకెళ్తాని చెంగల్ రెడ్డి చెప్పారు.సోషల్ మీడియా,డిజిటల్ మీడియాను విసృతంగా వినియోగించుకోవాలని ఆయన విద్యార్థు లను కోరారు.అన్ని తరుగుతల వారినీ ఒక్క తాటి పైకి తీసుకోచ్చి ర్యాలీలు విజయవంతం చేయాలన్నారు…..





