Tuesday, March 17, 2026

*పరిశ్రమలు- ఉపాధి కల్పన కార్యక్రమంలో పాల్గొన్న చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్,*

నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)*చిత్తూరు* చిత్తూరు రూరల్ మండలం, వెంకటాపురం వద్ద పరిశ్రమలు- ఉపాధి కల్పన పేరుతో నూతనంగా ఏర్పాటు చేసిన యం ఎస్ ఇ- సిడిపి కి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు వర్చువల్ విధానంలో విశాఖపట్నం నుంచి భూమి పూజ చేసారు. ఈ సందర్భంగా 5-వెంకటాపురంలో నిర్వహించిన కార్యక్రమంలో చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాద రావు , తెలుగుదేశం పార్టీ చిత్తూరు పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు సి.ఆర్.రాజన్, నగర మేయర్ కుమారి అముద , మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ , జిల్లా కలెక్టర్ ‌ సుమిత్ కుమార్ , చుడా ఛైర్పర్సన్ కఠారి హేమలత , శాప్ చైర్మన్ రవి నాయుడు , టిడిపి చిత్తూరు పార్లమెంటు జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్ ,టిడిపి సీనియర్ నేత చంద్రప్రకాష్ , ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి పాల్గొన్నాను.రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు నియోజకవర్గం పరిధిలోని చిత్తూరు రూరల్ మండలం,5-వెంకటాపురంలో పరిశ్రమలు -ఉపాధి కల్పన పేరుతో యం ఎస్ ఇ- సిడిపి ని ప్రారంభించడం అభినందనీయమన్నారు చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు దీని వల్ల చిత్తూరు పార్లమెంటు పరిధిలోని చిత్తూరు రూరల్ మండలంలో నిరుద్యోగ సమస్యకు పరిష్కారం లభించినట్లు అయిందని తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు రూరల్ మండలాన్ని పరిశ్రమల సబ్ తీర్చిదిద్దేందుకు నడుంబిగించడం .., ఆయన చిత్తశుద్ధికి, పాలనా దక్షతకు నిదర్శనంగా నిలుస్తోంది అన్నారు ప్రజా శ్రేయస్సు కోసం అహర్నిశలు కృషి చేస్తున్న సి.యం.కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానిఎంపి అన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News