Tuesday, March 17, 2026

ఎన్జీ కళాశాలలో ఘనంగా విద్యా దినోత్సవం-

నేటిసాక్షి, నల్లగొండ : పట్టణంలోని నాగార్జున ప్రభుత్వ కళాశాల (అటానమస్)లో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకొని ఎన్ఎస్ఎస్ యూనిట్స్ ఆధ్వర్యంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డా. పరంగి రవి కుమార్ అధ్యక్షతన మంగళవారం జాతీయ విద్యా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు, ఘన వేసినివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ, మౌలానా అబుల్ కలాం ఆజాద్ భారతదేశపు మొదటి విద్యా మంత్రి గానే కాకుండా, ఆధునిక విద్యా వ్యవస్థకు బాటలు వేసిన మహనీయుడని, విద్య ద్వారా సమాజ అభివృద్ధి సాధ్యమని గుర్తుచేశారు. జాతీయ విద్యా దినోత్సవం ప్రాధాన్యతను విద్యార్థులకు తెలియజేస్తూ, విజ్ఞానం మరియు మానవ విలువలకు ప్రాముఖ్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో డా. బట్టు కిరీటం, డా. మునిస్వామి, నర్సింగ్ కోటయ్య, కంబాల పల్లి శివరాణి, సావిత్రి, హబీబ్, జాజుల దినేష్, అంకుస్ తదితర అధ్యాపకులు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్, విద్యార్ధిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News