నేటి సాక్షి(పూరెళ్ల బాపు)……………………………………..ఈ క్రమంలో జిల్లా వ్యాప్తంగా వాహన తనిఖీలు, రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ లు, జన సమూహం ఎక్కువగా ఉండే పరిసరాల్లో బాంబ్ స్క్వాడ్, పోలీసు జాగిలాలతో విస్తృత తనిఖీలు నిర్వహించారు.ఈ తనిఖీలో భాగంగా అనుమానాస్పద వస్తువులు, ప్యాకేజీలు, సంచులు లేదా భద్రతకు ముప్పు కలిగించే అంశాలపై ప్రత్యేక తనిఖీ లు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ అశోక్ కుమార్ మట్లాడుతూ…ప్రజల సహకారంతోనే భద్రతా చర్యలు సమర్థవంతంగా కొనసాగుతాయని అన్నారు. హై అలర్ట్ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు లేదా వాహనాలు కనిపించిన సందర్భంలో వెంటనే సమీప పోలీస్ స్టేషన్, లేదా 100 నెంబర్ కి కు సమాచారం అందించాలి అని జిల్లా పోలీస్ శాఖ నిరంతరం ప్రజల రక్షణలో తగిన చర్యలు తీసుకుంటుంది,” అని తెలిపారు.





