నేటి సాక్షి, కోరుట్ల టౌన్*(గణేష్ గొల్లపల్లి)కోరుట్ల పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల (కాలేజీ గ్రౌండ్) లో చదువుతున్న ఉనైబా జరీన్ ఇటీవల కథలాపూర్ లో జరిగిన ఉమ్మడి కరీంనగర్ అండర్–14 ఖో– ఖో లో మంచి ప్రదర్శన కనబరిచి, రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైందని ప్రధాన ఉపాధ్యాయులు నల్ల భూమయ్య తెలిపారు. విద్యార్థిని ఎంపికపై పిడి మహిపాల్ రెడ్డి మరియు ఉపాధ్యాయిని,ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.





