నేటి సాక్షి, బాపట్ల జిల్లా (కర్లపాలెం)యూనియన్ బ్యాంక్ కర్లపాలెం శాఖ లో 107వ ఫౌండేషన్ దినోత్సవ వేడుకలు మంగళవారం మేనేజర్ కె. మానస ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మానస మాట్లాడుతూ 1973 వ సంవత్సరం లో కర్లపాలెం లో యూనియన్ బ్యాంక్ స్థాపించామని, దాదాపు 30000 వేల మంది ఖాతాదారులతో,300 కోట్ల వ్యాపారం కొనసాగుతుంది అన్నారు. ఈ సందర్భంగా రీజనల్ హెడ్ మాధురి, ఎమ్ డి అండ్ సీఈఓ ఆశిష్ పాండే,ఖాతాదారులకు ఫౌండేషన్ దినోత్సవం పురస్కరించుకొని ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆల్ ఇండియా యూనియన్ బ్యాంక్ ఆఫీసర్స్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ మెండు మహేంద్ర భాస్కరరావు పాల్గొని మాట్లాడుతూ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1919 లో 4బ్రాంచ్ లతో ప్రారంభించి నేటికి దాదాపు 8621 బ్రాంచ్ లు ,8910 ఏ టి ఎమ్ ల తో దేశం మొత్తం విస్తరించి ఉన్నాయి అన్నారు.చిన్న వృత్తి, వ్యవసాయ దారులకు, చేతి వృత్తుల వారికి, స్వయం సహాయక సంఘాల కు,చిన్న ,పెద్ద పరిశ్రమలకు మొదలైన అనేక రంగాల వాటికి యూనియన్ బ్యాంక్ ఆర్థిక సాయం అందిస్తూ దేశ ఆర్థిక,సామాజిక అభివృద్ధికి కృషి చేస్తుంది అన్నారు.ప్రస్తుత ఎమ్ డి ,సీఈఓ ఆశిష్ పాండే వివిధ రంగాల లో బ్యాంక్ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారు అన్నారు. సిబ్బంది కృషి తోనే బ్యాంక్ నేడు ఇంత స్థాయి కి చేరుకుంది అన్నారు.కార్యక్రమంలో మాజీ సర్పంచుల సంఘము అధ్యక్షలు గుండ్రెడ్డి శివ, డిప్యూటీ మేనేజర్ స్రవంతి ,సిబ్బంది శ్రీనివాసరావు, భాను అనీషా,సందీప్,జగదీష్ కుమార్,మహేష్,గోపి,జనకమహారాజ్, ప్రసాద్, జ్యోతి,బ్యాంక్ మిత్రాలు,తదితరులు పాల్గొన్నారు.





