Tuesday, March 17, 2026

ధారూర్ మెథడిస్ట్ జాతర సందర్భంగా ప్రత్యేక బందోబస్త్ ఏర్పాట్లు. జిల్లా ఎస్పీ కె. నారాయణ రెడ్డి,

నేటి సాక్షి వికారాబాద్ :వికారాబాద్ జిల్లా, ధారూర్ మండల పరిధిలో నవంబర్ 11 నుండి 16వ తేదీ వరకు జరగనున్న ప్రసిద్ధ మేథడిస్ట్ జాతర ఏర్పాట్లను జిల్లా ఎస్పీ శ్రీ కె. నారాయణ రెడ్డి, మంగళవారం క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. వికారాబాద్ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, ధరూర్ ఇన్‌స్పెక్టర్ రఘురాములు, ధరూర్ ఎస్‌ఐతో సహా సబ్ డివిజన్ అధికారులతో జాతర నిర్వాహకులతో కలసి ఆయన జాతర ప్రాంగణాన్ని, భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, ముగ్గురు డీస్పీ లు 8 మంది ఇన్స్పెక్టర్లు,30 మంది ఎస్ఐ లు, 350 మంది పోలీస్ సిబ్బంది తో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా, భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. దొంగతనాలు, చైన్ స్నాచింగ్‌లు వంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా పోలీసు పెట్రోలింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. జాతర పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు వివిధ శాఖ అధికారులతో అదనపు సిబ్బందిని, నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది అని ఎస్పీ తెలిపిపారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని శాఖల అధికారులతో కలసి పని చెయాలనీ, జాతరకు వచ్చే భక్తులు అప్రమత్తం గా ఉంటూ, పోలీస్ అధికారులకు సహకరించాలని జిల్లా ఎస్పీ తెలియజేయడం జరిగింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News