Tuesday, March 24, 2026

మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలు చిరస్మరనీయo.అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్.

నేటి సాక్షి వికారాబాద్:స్వాతంత్ర్య సమరయోధుడిగా, కేంద్ర తొలి విద్యాశాఖ మంత్రిగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ దేశానికి అందించిన సేవలు ఎప్పటికీ చరస్మరణీయ మని జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ అన్నారు.మంగళవారం భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ 137 వ జయంతి సందర్బంగా జాతీయ విద్యా దినోత్సవంగా నిర్వహించుకుంటున్న నేపథ్యంలో జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయ సమావేశం హాలు నందు ఆయన చిత్రపటానికి అదనపు కలెక్టర్ లు లింగ్యా నాయక్, సుదీర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ మౌలానా అరబిక్, ఇంగ్లీష్, ఉర్దూ, హిందీ, పర్షియన్, బెంగాలీ తదితర అనేక భాషల్లో ప్రావీణ్యత పొందారన్నారు. హిందూ, ముస్లిం ఐక్యత ఆధారంగా ఆల్ బలగ్ అనే పత్రికను ప్రారంభించి భారత జాతీయ వాదిగా పేరుగాంచారన్నారు.ఆజాద్ ఖిలాఫత్ ఉద్యమం ద్వారా ముస్లిం కమ్యూనిటీలో బ్రిటిష్ వ్యతిరేక భావాలు పెంచి అన్ని వర్గాల ప్రజలు స్వాతంత్రోద్యమంలో పాల్గొనేలా కీలకపాత్ర పోషించారన్నారు. దేశ తొలి విద్యాశాఖ మంత్రిగా 11 ఏళ్ల పాటు పనిచేసిన మౌలానాకు మరణాంతరం 1992లో భారతరత్న పురస్కారం లభించిందన్నారు. విద్య లేకుండా దేశము అభివృద్ధి చెందదని, విద్య స్వాతంత్రానికి రెండో రూపముగా పేర్కొన్న మౌలానా భారత విద్యావ్యవస్థకు బలమైన పునాదివేసిన మహానుభావుడని ఆయన సేవలను కొనియాడారు.ఈ కార్యక్రమంలో డి ఆర్ ఓ మంగీ లాల్, ఎ ఓ పరహీన ,జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News