నేటి సాక్షి పాలేరు , నవంబర్ 11 :సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ పై జరిగిన దాడికి నిరసనగా,ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు,పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు నవంబర్ 17న జరగనున్న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాదిగ జర్నలిస్టుల ఫోరం(ఎంజేఎఫ్) రాష్ట్ర కమిటీ సభ్యుడు ఆవుల రామరావు పిలుపునిచ్చారు.మంగళవారం కూసుమంచి మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో కూసుమంచి మండల కన్వీనర్ కొమ్ము ప్రభాకర్ రావు, కో-కన్వీనర్ ఇరుగు శ్రీను అధ్యక్షతన జరిగిన ఎంజేఎఫ్ పాలేరు నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.. ఈ సందర్భంగా మంద కృష్ణ మాదిగ పిలుపు మేరకు పాలేరు డివిజన్ నుండి అత్యధిక సంఖ్యలో ఎంజెఎఫ్ సభ్యులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.. ఈ కార్యక్రమంలో పాలేరు డివిజన్ ప్రధాన కార్యదర్శి పోలేపోంగు నాగరాజు,ముదిగొండ మండల ఎంజేఎఫ్ నాయకులు నూకల రమణ,తిరుమలాయపాలెం ఎంజేఎఫ్ నాయకులు పోలేపొంగు వెంకన్న,నవిల బాబు, ఖమ్మం రూరల్ ఎంజేఎఫ్ నాయకులు వెలుతురు వీరకుమార్ తదితరులు పాల్గొన్నారు.




