Tuesday, March 24, 2026

సైబర్ నేరాలపై అవగాహన..అవగాహన కల్పిస్తున్న చందుర్తి ఎస్ఐ జె రమేష్..

నేటిసాక్షి ప్రతినిధి చందుర్తి (సతీష్)చందుర్తి మండల కేంద్రంలోని లింగంపేట గ్రామంలో మంగళవారం చందుర్తి పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ ఈ ఆధునిక టెక్నాలజీ కాలంలో సెల్ ఫోన్ వినియోగం పెరిగిపోయిందని అన్నారు. ప్రతిదీ సెల్ ఫోన్ తో మన బ్యాంక్ ఖాతా, పాన్ కార్డు, ఆధార్ కార్డులకు సంబంధించి అన్ని విధాలుగా మన సెల్ ఫోన్ లింక్ అవసరం ఉంటుందన్నారు. దాన్ని ఆసరాగా చేసుకుని సైబర్ నెరగాళ్లు మనకు ఏదో లేనిపోని ఆశలు, లింకులు పంపీ సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు ఆయన తెలిపారు. పూర్తిగా సైబర్ నేరాల పట్ల తదితర అంశాలపై అవగాహన కలిగి ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. గుర్తుతెలియని వ్యక్తుల నుండి ఫోన్ చేసి ఓటీపీ, పిన్ నెంబర్, బ్యాంకు ఖాతా, తదితర వివరాలు కోరితే ఇవ్వవద్దన్నారు. ఏ విధంగా అయినా మీరు మీ బ్యాంకు ఖాతా నుండి డబ్బులు కోల్పోతే వెంటనే సమీప పోలీస్ స్టేషన్లో గాని సైబర్ నేరాల పట్ల టోల్ ఫ్రీ నెంబర్ 1930 లేదా 100 లకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో చందుర్తి ఎస్సై జె రమేష్ పోలీస్ సిబ్బంది గ్రామ ప్రజలు, రైతులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News