Tuesday, March 17, 2026

*నవభారత నిర్మాణంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ కీలక పాత్ర పోషించారు**జాతీయ సమైక్యవాదిగా పటేల్ స్ఫూర్తి ప్రపంచానికే ఆదర్శంగా నిలిచింది**’యువత’ ఆ మహనీయుని బాటలో నడిచి దేశం సేవకు అంకితం కావాలి**చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు, ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్*

నేటి సాక్షి తిరుపతి(బాదూరు బాల)చిత్తూరు స్వాతంత్ర్య సమరయోధుడు, సంఘ సంస్కర్త, భారతదేశ మొదటి ఉప ప్రధానమంత్రి, హోం మంత్రి, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ నవభారత నిర్మాణంలో కీలకపాత్ర పోషించి , ప్రపంచానికే స్ఫూర్తి ప్రదాతగా నిలిచారని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ అన్నారు..సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయితోత్సవాలను పురస్కరించుకొని, బుధవారం చిత్తూరులోని గాంధీ విగ్రహం కూడలి వద్ద నిర్వహించిన ఏక్తాదివస్ కార్యక్రమానికి చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ముఖ్య అతిథులుగా హాజరు కాగా.., జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్,నగర మేయర్ కుమారి అముద, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు అతిథులుగా పాల్గొన్నారు.ముందుగా వారు సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్ర పటానికి పుష్పాలు సమర్పించి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఎంపీ, ఎమ్మెల్యేలు జాతీయ పతాకాన్ని చేత బూని, ఏక్తాదివస్ ర్యాలీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. చిత్తూరులోని గాంధీ విగ్రహం వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీలో విద్యార్థులతో కలిసి పాల్గొన్నారు. ఈ ర్యాలీ నగర పురవీధుల గుండా సాగింది. వందేమాతరం నినాదలతో మారుమ్రోగింది.ఈ సందర్భంగా చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ మాట్లాడుతూ…భారత్ ఏకీకరణ కోసం దేశంలోని సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసి దేశం సమగ్రతను కాపాడడంలో ఆయన చేసిన కృషి ఎనలేనిది కొనియాడారు. దీనికి గుర్తింపుగా, ఆయనకు “భారతదేశపు ఉక్కు మనిషి” అనే బిరుదు లభించిందన్నారు. ఈ నేపథ్యంలోనే అక్టోబర్ 31ని “జాతీయ ఐక్యత దినోత్సవం”గా జరుపుకుంటునామని తెలియజేశారు. ముఖ్యంగా యువత.. సర్దార్ వల్లభాయ్ పటేల్ స్ఫూర్తితో దేశ సేవకు అంకితం కావాలని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో.. చిత్తూరు టీడీపీ పార్లమెంట్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్, బిజెపి జిల్లా అధ్యక్షుడు జగదీష్ నాయుడు, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News