నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి నవంబర్ 12 చౌడేపల్లి మండలం పుదిపట్ల గ్రామంలో వెలిసిన స్వయంభు శ్రీ వైష్ణవి దేవి ఆలయంలో అష్టమి సందర్భంగా అమ్మవారికి ,అభయాంజనేయ స్వామికి, నాగ భైరవ స్వామికి ఉదయమే ఆలయ అర్చకురాలు శ్రావణి పంచామృత అభిషేకం చేసి ,అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. కుజదోషం ,సర్పదోషం, పెళ్ళికాను వారు నాగ భైరవ స్వామికి అష్టమి రోజున పంచదీపారాధన సమర్పించుకుంటారు. చౌడేపల్లి ,పుంగనూరు , ఇటుక నెల్లూరు చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. ఈరోజు ఉభయదారులుగా ఇటికినెల్లూరుకు చెందిన వెంకటరమణారెడ్డి దంపతులు, పుదిపట్లకు చెందిన మహేష్ రెడ్డి ధర్మపత్ని భారతీ వ్యవహరించారు. ఆలయ ధర్మకర్త వినోద్ కుమార్ భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. అదేవిధంగా 14/11/2025 శుక్రవారం అమ్మవారికి 108 కళశాలతో అభిషేకము సౌందర్యలహరి పారాయణం, మరియు సుహాసిని పూజ జరుగును. ఈ కార్యక్రమం ఉదయం 8 గంటల నుండి 12 గంటల వరకు జరుగును. అనంతరం తీర్థ ప్రసాదాలు వితరణ జరుగును కావున భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని గుడి నిర్మాతలు కోరారు.





