Tuesday, March 17, 2026

*గొర్రెల పెంపకందారులను పరామర్శించిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్**నేటి వరకు 62 గొర్రెలు చనిపోయాయని మాజీ మంత్రి కొప్పులతో తమ గోడు వెళ్లబోసుకున్న బాధిత గొర్రెల పెంపకం దార్లు*

*నేటి సాక్షి, ధర్మారం (నవంబర్ 12)* : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పెర్కపల్లి గ్రామంలో గత కొద్ది రోజుల క్రితం విషాహారం తిని పదుల సంఖ్యలో గొర్రెలు మరణించగా విషయం తెలుసుకున్న మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ బాధిత గొర్రెల పెంపకం దారులతో చరవాణిలో మాట్లాడి పరామర్శించారు. అధైర్య పడద్దని వారిలో మనోధైర్యం నింపి త్వరలోనే గ్రామానికి వచ్చి సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి న్యాయం జరిగేలా చూస్తానని అన్నారు. అన్నట్లుగానే బుధవారం పెర్కపల్లి గ్రామానికి మండల బి ఆర్ ఎస్ పార్టీ నాయకులతో కలిసి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ వెళ్లి గొర్రెల పెంపకం దారులను పరామర్శించి జరిగిన సంఘటన గురించి తెలుసుకొన్నారు. విషాహారం తిని నేటి వరకు 62 గొర్రెలు మరణించయాని బాధిత గొర్రెల పెంపకం దారులు వాపోయారు. ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి మాకు ఎలాంటి సహాయం అందలేదని కనీసం అనారోగ్యం పాలైన వాటికి మందులు కూడా ఇస్తలేరని తమ గోడు వెళ్లబోసుకున్నారు. అనంతరం మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండల పశు వైద్యాధికారి, పెద్దపల్లి జిల్లా పశు వైద్యాధికారితో ఫోన్లో మాట్లాడి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి త్వరగా చర్యలు తీసుకుని నష్ట పరిహారాన్ని అందించాలని కోరారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ… విషాహారం తిని 62 గొర్రెలు చనిపోతే ప్రభుత్వానికి గాని, ఇక్కడి మంత్రికి గానీ చలనం వస్తలేదని మండి పడ్డారు. బాధితులను అదుకునే కనీస సోయి కూడా వారికి లేదని విమర్శించారు. కనీసం అనారోగ్యం పాలైన వాటికి మందులు ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో పాలకులు, అధికారులు ఉన్నారని అన్నారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి తక్షణమే జిల్లా కలెక్టర్ తో మాట్లాడి బాధితులకు నష్ట పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో బాధితుల పక్షాన బి ఆర్ ఎస్ పార్టీ ప్రజా క్షేత్రం లో పోరాడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తాజా మాజీ ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News